బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో ముగ్గురు హీరోలు !
డ్రగ్స్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూసే అవకాశం కనిపిస్తోంది. మరో ముగ్గురు హీరోలకు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్‌మెంట్ ఉందన్న ప్రచారం సాగుతోంది.
డ్రగ్స్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూసే అవకాశం కనిపిస్తోంది. మరో ముగ్గురు హీరోలకు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్‌మెంట్ ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో వారికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కరణ్‌జోహార్ ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న హీరోలకే ఈ నోటీసులు ఇస్తారన్న గుసగుసలు బాలీవుడ్‌లో వినిపిస్తోంది.
డ్రగ్స్ విచారణ దెబ్బకు బాలీవుడ్ షేక్ అవుతోంది. దీపికా పదుకునే వంటి అగ్రనటితో పాటు రకుల్ ప్రీత్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ ఇప్పటికే ఎన్సీబీ విచారణకు ఎదుర్కొంటున్నారు. తాజాగా మరో నలుగురు నటుల పేర్లు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. విచారణలో పేర్లు బయటకు వచ్చిన అందరి ఫోన్లపై ఎన్సీబీ అధికారులు నిఘా పెట్టినట్టు సమాచారం.
రియా చక్రవర్తి జ్యుడీషియల్ కస్టడీ గడువు అక్టోబర్ 6తో ముగియనుంది. ప్రస్తుతం రియా చక్రవర్తి బైకులా జైలులో ఉండగా, షోవిక్ తలోజాను సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో బెయిల్ కోరుతూ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు 18 పేజీల అఫిడవిట్‌ను ముంబై హైకోర్టుకు సమర్పించారు. ఇందులో ఆసక్తికర అంశాలున్నాయి. సుశాంత్‌కు డ్రగ్స్ ను సరఫరా చేయడంలో రియా పాత్ర ఉందని స్పష్టం చేశారు. సుశాంత్ డ్రగ్స్ వాడతాడని తెలిసి కూడా రియా అతడికి దగ్గరైందని తెలిపారు. అటు.. సుశాంత్‌సింగ్ శరీరంలో విషం ఆనవాళ్లు ఏం కనిపించలేదని ఎయిమ్స్ అధికారులు విశ్లేషించిన నేపథ్యంలో వృత్తిపరమైన అంశాలతో పాటు ఇతర వాటిపై సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది.