AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: నేను పర్‍ఫెక్ట్ కాదు.. అయినా నేను స్ట్రాంగ్.. సమంత చెప్పిన ఈ మాటలకు అర్థమేంటో..

సమంత... గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ..

Samantha: నేను పర్‍ఫెక్ట్ కాదు.. అయినా నేను స్ట్రాంగ్.. సమంత చెప్పిన ఈ మాటలకు అర్థమేంటో..
Sam
Rajitha Chanti
|

Updated on: Nov 02, 2021 | 2:30 PM

Share

సమంత… గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ.. సన్నిహితులతో కలిసి తెగ విదేశాల్లో తెగ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల తను ఏం చేస్తున్నా.. ఎక్కడికి వెళ్తున్నా.. ప్రతి విషయాన్ని నెట్టింట్లో షేర్ చేస్తుంది.. అలాగే.. ప్రస్తుత తన మానసిక పరిస్థితిని వివరించేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం సమంతపై పూర్తిగా నెగిటివ్ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ప్రకటన అనంతరం కొద్ది రోజులుగా సైలెంట్‏గా ఉన్న సామ్.. ఆ తర్వాత.. ఇంటర్నెట్‏లో యాక్టివ్‏గా ఉంటూ.. రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తుంది. ఇటీవల కొన్ని రోజులుగా సామ్ తన ఇన్‏స్టా స్టోరీలలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేస్తుంది.

అలాగే విడాకుల ప్రకటన కంటే ముందే సామ్.. తన సోషల్ మీడియా ఖాతాలలో మై మామ్స్ సేడ్ అనే హ్యాష్‏ట్యాగ్‏తో పలు ఆసక్తికర పోస్ట్స్ చేసింది. తాజాగా మరోసారి మై మామ్స్ సేడ్ అనే హ్యాష్‏ట్యాగ్‏తో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది… ” నేను స్ట్రాంగ్.. నేను కఠినమైన పరిస్థితుల నుంచి సులువుగా బయటపడతాను. నేను పర్‏ఫెక్ట్ కాదు.. కానీ నాకు నేను పర్‏ఫెక్ట్… నేను ఎప్పటికీ వెనకడుగు వేయను.. నేను ప్రేమ, దయ కలదాన్ని… నేను దృడ నిశ్చయం కలదాన్ని.. నేను మనిషిని… నేను యోధురాలిని.. ” అని అమ్మ చెప్పింది అంటూ పోస్ట్ చేసింది సామ్.. ప్రస్తుతం సమంత పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

Samantha

Samantha

ఇక ప్రస్తుతం సమంత.. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అలాగే.. ఇటీవల ఆమె నటించిన శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కాతువాకుల రెండు కాదల్ మూవీలోనూ నటిస్తోంది.

Also Read: Acharya Movie: రాధాకృష్ణలుగా మారిన పూజా హెగ్డే, రామ్‌ చరణ్‌.. ఆకట్టుకుంటోన్న ఆచార్య కొత్త పోస్టర్‌..

Nivetha Thomas: అందం, అభినయం కలగలిపిన అందాల తార నివేదా థామస్‌.. నేడు ఈ కేరళ కుట్టీ పుట్టిన రోజు..