
ప్రపంచాన్ని పర్యటించడానికి.. అలాగే తన ట్రావెల్ కలలను నెరవేర్చుకోవడానికి టాలీవుడ్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా అమెరికాలో విశ్రాంతి తీసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. అలాగే అక్కడి అందమైన లొకేషన్ ఫోటోస్ షేర్ చేస్తూ తన సంతోషాన్ని ఫాలోవర్లతో పంచుకుంటుంది. తాజాగా వెనిస్ నుంచి తన కొత్త ఫోటోలను పంచున్నారు. వెనిస్ నడిమధ్యన ఉన్న గెలాటో స్వర్గధామం అయిన గెలాటోటెకా సుసో – ఇటాలియన్ అడ్వైంచర్ ఫోటోస్ షేర్ చేసింది. ఈ మనోహరమైన ట్రీట్‌ను ఆస్వాదించడానికి ఆమె లైన్‌లో వెయిట్ చేస్తోన్న ఫోటోను పంచుకుంటూ.. “నిరీక్షించే వారికి ఎప్పుడూ మంచి విషయాలు జరుగుతుంటాయి” అనే క్యాప్షన్ ఇచ్చింది సామ్. ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
ఇదిలా ఉంటే..ఓవైపు సినిమాలతో అలరిస్తూనే.. మరోవైపు తన ఫిట్నేస్, ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకుంటుంది. కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సామ్.. త్వరలోనే ఆ వ్యాధికి చికిత్స తీసుకోనుంది. అందుకే చికిత్సకు ముందు మానసికంగా మరింత బలంగా అయ్యేందుకు సామ్.. ఇప్పుడు తనకు నచ్చిన ప్రదేశాల్లో సరదాగా గడుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో జిమ్ వర్కవుట్ వీడియోస్, మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లలో స్పూర్తి నింపుతుంది సామ్.
సామ్ చివరిసారిగా ఖుషి చిత్రంలో నటించింది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా.. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు హిందీలో ఆమె నటించిన సిటాడెల్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. అమెరికన్ సిరీస్ సిటాడెల్ రీమేక్ ఇది. రాజ్&డీకే దర్శకత్వం వహించిన సిటాడెల్ చిత్రంలో వరుణ్ ధావన్ హీరోగా నటించారు. అటు హిందీలోనూ సమంతకు వరుస ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ జోడిగా సామ్ నటించనుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.