Samantha: స్టైల్ మార్చిన సమంత.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టిస్తోన్న సామ్..
ఈ మధ్య హీరోయిన్లు కథల్లో మాత్రమే కాదు.. వేసుకునే బట్టల్లోనూ.. చేసే ఫోటో షూట్స్‌లోనూ.. కాస్త బ్రాడ్ గా ఆలోచిస్తున్నారు. మొహమాటం లేకుండా.. తమ ఫ్యాన్స్‌కు పరువాల విందునిస్తున్నారు. దాంతో పాటే నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. దాంతో పాటే ట్రోల్ కూడా అవుతున్నారు. ఇప్పుడు సమంత కూడా ఈ రెండు విషయాల్లోనూ హాట్ టాపిక్ అవుతున్నారు.

మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకున్నాక సామ్.. కాస్త ఎక్స్‌పోజింగ్ చేయడం మొదలెట్టారు. తన డెయిలీ రొటీన్‌లో భాగంగా… బికీనీ అవతార్‌లో స్విమ్ ఫోటోస్‌తో సహా.. వర్కవుట్ వీడియోలను.. షేర్ చేస్తూ వస్తున్నారు. సామ్ పూర్తిగా మారిపోయారనే కామెంట్ వచ్చేలా చేసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ బ్యూటీ…గ్రాజియా మ్యాగజీన్ కవర్ పేజీపై మెరిసిపోయారు. ఇప్పుడా ఫోటోలతో సోషల్ మీడియాలో సెన్సేషనల్ అవుతున్నారు ఈమె. దాంతో పాటే.. సామ్ పద్దతిపై కొందరు విమర్శిస్తున్నారు. ఈ రేంజ్ ట్రాన్స్‌ఫార్మేషన్ వద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాస్త ఓవర్ అయిందంటూ… పోస్టులు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే.. 15 సంవత్సరాలకు పైగా సినిమాల్లో నటించిన తర్వాత, తనకు వచ్చే ప్రతిదానికీ సంతకం చేయవలసిన అవసరం లేదని అంటుంది సమంత. ప్రస్తుతం ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది సామ్. ఇటీవల గ్రాజియా ఇండియాతో జరిగిన చాట్‌లో సమంత మాట్లాడుతూ.. ప్రస్తుతం తనకు ఇష్టమైన పనులను మాత్రమే చేసేందుకు ఆలోచిస్తున్నానని.. అందులో ఫిట్నెస్, సినిమాలు రెండూ ఉన్నాయని అన్నారు, సినిమాలు, సిరీస్ లలో నటించానని.. కానీ అవన్నీ ఫ్యాషన్ ప్రాజెక్ట్స్ కావని అన్నారు. ఇప్పుడు, నేను చేసే ప్రతి పని, నేను పెట్టుబడి పెట్టే ప్రతి వ్యాపారం, నేను నిర్మించే ప్రతి సినిమా, అన్నీ తన మనసుకు నచ్చినవే అని అన్నారు సామ్. ఇకపై ఒకేసారి ఐదు సినిమాలు చేయడం లేదని.. ఇప్పుడు శరీరం చెప్పేది వినాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పుడు నేను చేసే ప్రతి పని, శక్తిని పెడతానని అన్నారు.
ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..




