Samantha: `ఊ అంటవా మావ.. ఊఊ అంటావా` ట్రోల్స్‌పై సమంత ఏం చెప్పిందంటే..?
Samantha: సౌత్ ఇండియన్ సినిమా 'పుష్ప'పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రజలను ఆలోచింపజేసింది. ఈ చిత్రంలో

Samantha: సౌత్ ఇండియన్ సినిమా ‘పుష్ప’పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రజలను ఆలోచింపజేసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నల బెస్ట్ యాక్టింగ్ మీరు చూడొచ్చు. అయితే సినిమాలో హీరోయిన్ సమంత చేసిన ఐటెం డ్యాన్స్‌పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా బాక్సాఫీసు వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబడుతోంది. అయితే సమంత చేసిన ఐటెమ్ సాంగ్ `ఊ అంటవా మావ.. ఊఊ అంటావా` సాంగ్ పురుషుల ఆగ్రహానికి గురైంది. సినిమా విడుదలకు ముందే వివాదం సృష్టించిన ఈ పాటపై కొంత మంది ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పాటపై వస్తున్న ట్రోల్స్‌పై సమంత స్పందించింది.
సమంత ఈ విధంగా చెప్పుకొచ్చింది. “ఊ అంటవా మావ.. ఊఊ అంటావా సాంగ్‌కి నేను బాగా ఆడాను. నేను ఏది చేసినా దానిలో మెరుగ్గా ఉండటానికి కష్టపడుతున్నాను. సదా మీ ప్రేమకు ధన్యవాదాలు?” అని చెప్పింది. అయితే పుష్ప’ ఐటెం సాంగ్ షూటింగ్‌లో అల్లు అర్జున్‌తో స్టెప్పులు, రిథమ్, డ్యాన్స్‌లకి తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి సమంత వెల్లడించింది. ఈ పాటలో నటించే అవకాశాన్ని సమంత మొదట తిరస్కరించిందని దర్శకుడు సుకుమార్ తెలిపారు. తరువాత అతను ఆమెను ఒప్పించాడు ‘రంగస్థలం’లో పూజా హెగ్డే డ్యాన్స్ ఉదాహరణగా చెప్పాడు.
అయితే `ఊ అంటవా మావ.. ఊఊ అంటావా` పాటని ఐదు భాషల్లో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. పుష్ప సినిమాకిది హైలెట్‌గా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే, ‘పుష్ప’లో సమంత ఐటెం సాంగ్‌కి చేసిన బోల్డ్ స్టెప్స్‌పై ప్రశంసలు అందుకుంటుంది. గ్లామర్ డాల్‌గా మారి చేసిన ఈ హాట్ డాన్సు ఇప్పుడు యువతని ఉర్రూతలూగిస్తోంది. మాస్ బీట్‌గా అందరిని మెప్పిస్తుంది. రచయిత చంద్రబోస్ ఈ పాటని రాయగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. గణేష్ ఆచార్య డ్యాన్స్ మాస్టర్‌గా వ్యవహరించారు. ఇంద్రావతి చౌహాన్ ఆలపించారు.


