Samantha Ruth Prabhu: అవన్నీ వట్టి రూమర్సే.. క్లారిటీ ఇచ్చిన సామ్ టీమ్
అందాల భామ సమంత రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో సమంత టాప్ ప్లేస్ లో ఉన్నారు.
అందాల భామ సమంత(Samantha Ruth Prabhu)రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో సమంత టాప్ ప్లేస్ లో ఉన్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లోనూ ఈ అమ్మడు సత్తా చాటింది. ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ చేస్తోంది సామ్. ఇప్పటికే బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ 2 సీరీస్‌లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో రెండు హిందీ సినిమాలు ఉన్నాయని అంటున్నారు. పెళ్లితర్వాత సమంత ఆచితూచి సినిమాలు చేసింది. నాగ చైతన్య ను పెళ్లాడిన తర్వాత సామ్ జోరు తగ్గించిందనే చెప్పలి. ఇక విడాకుల తర్వాత మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోయింది సామ్. సోషల్ మీడియాను షేక్ చేసింది. హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను కవ్వించింది సామ్. విడిపోయిన మొదట్లో కొన్ని మోటివేషనల్ కోట్స్ షేర్ చేసిన సామ్. ఆ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా సామ్ గురించి ఓవార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది సెలబ్రెటీలకు రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అలాగే సామ్ కూడా ఓ భయంకర వ్యాధితో బాధపడిందని టాక్. సామ్ పాలీమార్ఫస్ లైట్ ఎరప్షన్ అనే తీవ్రమైన వ్యాధితో బాధపడ్డారని అంటున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు సూర్యరష్మి పడగానే చర్మం మొత్తం దద్దుర్లు రావడంతో ఎంతో ఇబ్బందికి గురవుతారట. దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడంతో ప్రస్తుతం ఈమె ఈ సమస్య నుంచి బయటపడినట్లు అంటున్నారు. అయితే దీనిపై సమంత మేనేజర్ స్పందించారు. అవన్నీ రూమర్స్ మాత్రమే అని కొట్టిపారేశారు. సామ్ గురించి వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం సామ్ తెలుగులో యశోద, శాకుంతలం సినిమాల్లో నటిస్తోంది.