Tollywood: తస్సాదియ్యా.. హెవీ వర్కవుట్లతో చెమటలు పట్టించేస్తోన్నహీరోయిన్.. అమ్మాడి రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..

సాధారణంగా సోషల్ మీడియాలో సినీతారలకు సంబంధించిన ప్రతి విషయం క్షణాల్లో వైరలవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొన్ని రోజులుగా తారల త్రోబ్యాక్, చైల్డ్ హుడ్ ఫోటోస్, వారి నెట్ వర్త్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ బ్యూటీకి సంబంధించిన జిమ్ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Tollywood: తస్సాదియ్యా.. హెవీ వర్కవుట్లతో చెమటలు పట్టించేస్తోన్నహీరోయిన్.. అమ్మాడి రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..
Samantha New

Updated on: Feb 28, 2025 | 7:23 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలోని స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఒకప్పటిలా ప్రాజెక్ట్స్ మాత్రం ఒకే చేయడం లేదు. వరుస సినిమాలు కూడా చేయడం లేదు. ఎప్పుడో ఒకసారి మీడియా ముందుకు వస్తున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ క్రేజీ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. జిమ్ లో హెవీ వర్కవుట్లతో చెమటలు చిందిస్తుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టరా.. ? తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ సమంత.

కొన్నాళ్లుగా మయోసైటిస్ తో బాధపడుతున్న సామ్.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తుంది. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ పోస్టులు చేస్తున్న సామ్.. ఇప్పుడు జిమ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో దాదాపు 110 కేజీల బరువును ఎత్తేస్తూ అందరినీ మోటివేట్ చేస్తుంది. దీంతో సామ్ రీఎంట్రీ ఎప్పుడూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సామ్ ఎప్పుడెప్పుడు సినిమా చేస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

Samantha

సమంత చివరిసారిగా సిటాడెల్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె కేవలం మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. అలాగే ఇప్పుడిప్పుడు విభిన్నమైన ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు విజయ్ దేవరకొండ సరసన నటించి ఖుషి చిత్రం సైతం సూపర్ హిట్ అయ్యింది.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..