అఖిల్ మూవీలో స‌మంత గెస్ట్ రోల్ !

అఖిల్ మూవీలో స‌మంత గెస్ట్ రోల్ !

అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు వాసు వర్మలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Ram Naramaneni

|

Aug 09, 2020 | 2:00 PM

Akhil Akkineni Most Eligible Bachelor movie : అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’‌ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు వాసు వర్మలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. వరుస ప్లాపులలో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కాగా అఖిల్‌కు ఇప్ప‌టివ‌ర‌కు సాలిడ్ హిట్ లేదు. దీంతో ఈ చిత్ర ద‌ర్శ‌కుడికి, హీరోకు కూడా ప్ర‌స్తుతం సినిమా విజ‌యం చాలా ముఖ్యం. అస‌లు వరుస పరాజయాల్లో ఉన్నఈ హీరో, డైరెక్ట‌ర్‌ కాంబినేషన్ ఎలా కుదిరిందని అందరు ఆశ్చర్యపోయారు. కాగా భాస్కర్ చెప్పిన క‌థ థీమ్ అదిరిపోయింద‌ని..అందుకే గట్టి నమ్మకంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు. ఈ సినిమాలో అఖిల్ స‌ర‌స‌న‌ పూజా హెగ్డే న‌టిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కూడా ఫైన‌ల్ స్టేజ్‌కు వచ్చేసింది.

కరోనా కారణంగా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ ఆగిపోయింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరోయిన్ సమంత గెస్ట్ పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. గ‌తంలో త‌న మామ నాగార్జున ‘మన్మథుడు-2’ సినిమాలో రెండు నిమిషాలు కనిపించే పాత్ర చేసింది కోడలు సమంత. ఇప్పుడు మరిది అఖిల్ కోసం కూడా అతిథిగా క‌నివిందు చేయ‌నుంద‌ట‌. సినీవర్గాల సమాచారం ప్రకారం.. బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ్ తన స్టోరీని మొదట్లో ఓ లేడీ స్కూటి ఎక్కి చెబుతూ ఉంటాడు.. అలాగే ఈ చిత్రంలో అఖిల్ తన కథను సమంతకు చెబుతాడేమో అని ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ పాత్రను చాలా స్పెషల్‌గా భాస్కర్ డిజైన్ చేసాడని చెబుతున్నారు.

Read More :  ల్గొండలో ఘ‌రానా దొంగ‌లు.. ఏకంగా ఎస్ఐ ఇంట్లోనే చోరీ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu