సుశాంత్ కేసు బ‌దిలీ మ‌హా ప్ర‌భుత్వంపై కుట్రే అన్న సంజ‌య్ రౌత్

సుశాంత్ కేసు బ‌దిలీ మ‌హా ప్ర‌భుత్వంపై కుట్రే అన్న సంజ‌య్ రౌత్

బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం కేసు విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కి అప్పగించడంపై శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ ఫైర‌య్యారు.

Ram Naramaneni

|

Aug 09, 2020 | 3:06 PM

Sushant Singh Rajput Death Case : బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం కేసు విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కి అప్పగించడంపై శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ ఫైర‌య్యారు. రాజకీయ ప‌న్నాగాల్లో భాగంగా మ‌హారాష్ట్ర‌ ప్ర‌భుత్వాన్ని ఒత్తిడి పెట్టాల‌నే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయ‌న ఆరోపించారు. ఆదివారం తమ పార్టీ పత్రిక సామ్నాలో ఈ ఇష్యూపై వ్యాసం రాసిన ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. సుశాంత్‌ కేసును సీబీఐకి బ‌దిలీ చేయ‌డం ముంబై పోలీసులను అవమానించినట్లేనన్నారు. సీబీఐని కేంద్రం ఎలా దుర్వినియోగం చేస్తుందో ఆయ‌న త‌న వ్యాసంలో వివ‌రించారు. సీబీఐ కేంద్రానికి సంబంధించిన సంస్థ‌ అయినప్పటికీ, అది నిష్పాక్షికంగా దర్యాప్తు జరపదని చాలా కేసుల్లో తేట‌తెల్ల‌మైంద‌ని పేర్కొన్నారు.

“పలు స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్స్ సీబీఐని నిషేధించాయి. శారదా చిట్‌ ఫండ్ కేసులో జోక్యం చేసుకున్నందుకు సీబీఐకి వ్యతిరేకంగా బెంగాల్‌లో ప్రజలు రోడ్ల‌పైకి నిర‌స‌న ప్ర‌ద‌ర్శించారు. అంతేకాదు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న స‌మయంలో… సీబీఐపై ఇలాంటి అభిప్రాయాన్నే వ్య‌క్త‌ప‌రిచారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్ల కేసును సీబీఐకి బదిలీ చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. న‌టుడు సుశాంత్‌ కేసును కూడా సీబీఐకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తే తప్పేంటి?” అని సంజయ్ రౌత్‌ ప్రశ్నించారు. అలాగే మీడియాలో ఓ వ‌ర్గం స‌హ‌యాన్ని పొందుతున్న‌ బీజేపీ.. ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వానికి మ‌చ్చ‌ తెచ్చేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు.

Also Read : నల్గొండలో ఘ‌రానా దొంగ‌లు.. ఏకంగా ఎస్ఐ ఇంట్లోనే చోరీ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu