ఒకే సినిమాలో అక్కా చెల్లెళ్లుగా ర‌ష్మిక, స‌మంత‌?

ఒకే సినిమాలో అక్కా చెల్లెళ్లుగా ర‌ష్మిక, స‌మంత‌?

ఒకే సినిమాలో అక్కినేని స‌మంత‌, ర‌ష్మిక మంద‌న్న క‌లిసి న‌టించ‌బోతున్నారా? అంటే అవున‌నే అంటున్నాయి ఫిల్మ్ వ‌ర్గాలు. వివ‌రాల్లోకి వెళ్తే.. వివాహం అయినా త‌న‌దైన శైలిలో సినిమాల‌ను ఎంచుకుంటూ స్టార్ హీరోయిన్ కొన‌సాగుతున్న స‌మంత అక్కినేని.. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కాలు పెట్టిన అతి త‌క్కువ స‌మ‌యంలోనే..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 09, 2020 | 12:36 PM

ఒకే సినిమాలో అక్కినేని స‌మంత‌, ర‌ష్మిక మంద‌న్న క‌లిసి న‌టించ‌బోతున్నారా? అంటే అవున‌నే అంటున్నాయి ఫిల్మ్ వ‌ర్గాలు. వివ‌రాల్లోకి వెళ్తే.. వివాహం అయినా త‌న‌దైన శైలిలో సినిమాల‌ను ఎంచుకుంటూ స్టార్ హీరోయిన్ కొన‌సాగుతున్న స‌మంత అక్కినేని.. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కాలు పెట్టిన అతి త‌క్కువ స‌మ‌యంలోనే వ‌రుస విజ‌యాల‌ను ద‌క్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక ర‌ష్మిక కూడా త‌న క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్, స్మైల్‌తో ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస విజ‌యాలు అందుకొని దూకుడు మీద ఉంది ఈ భామ‌. మ‌రి ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఈ స్టార్ హీరోయిన్స్ ఇద్ద‌రూ క‌లిసి ఒకే సినిమాలో క‌నిపిస్తే ఎలా ఉంటుంది? ఫ‌్యాన్స్ ఆనందానికి అడ్డు ఉండ‌దు. ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ కాంబినేష‌న్ త్వ‌ర‌లోనే రాబోతున్న‌ట్టు తెలుస్తోంది.

ఓ యంగ్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించ‌బోయే సినిమాలో ఈ ముద్దుగుమ్మ‌లిద్ద‌రూ న‌టించ‌బోతున్నార‌ట‌. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఓ యువ ద‌ర్శ‌కుడు వీరిద్ద‌రి కోసం మ‌హిళా ప్రాధాన్య‌మున్న ఓ స్టోరీని సిద్ధం చేశార‌ట‌. ఆ క‌థ‌ను విన్న స‌మంత‌, ర‌ష్మిక అక్కా చెల్లెళ్లుగా న‌టించ‌డానికి ఒప్పుకున్నార‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక సామ్‌, ర‌ష్మిక ఓకే చెప్ప‌డంతో.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించ‌నుంద‌ని వార్త‌లు వస్తున్నాయి. అన్నీ కుదిరి ఈ మూవీ ప‌ట్టాలెక్కితే.. ఈ క్రేజీ కాంబినేష‌న్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటుంద‌ని సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక దీనిపై క్లారిటీ రావాలంటే.. అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేంత వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.

Read More:

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉధృతంగా పెరుగుతోన్న కోవిడ్ కేసులు

ప్రిన్స్ బ‌ర్త్‌డే స్పెష‌ల్ః ‘స‌ర్కారు వారి పాట’ మోష‌న్ పోస్ట‌ర్ అదిరింది

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu