Salaar Movie: ‘సలార్’ సినిమా పైరసీ కనిపిస్తే ఇలా చేయండి.. ప్రభాస్ అభిమానులకు మేకర్స్ రిక్వెస్ట్..
మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు నీల్. ఇందులో ప్రభాస్ ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్‌తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇందులో జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్ కీలకపాత్రలు పోషించగా.. రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ సినిమా ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల అయ్యింది.
బాహుబాలి తర్వాత సలార్ సినిమాతో ఆరేంజ్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమాకు ఉదయం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు అర్దరాత్రి నుంచి స్పెషల్ సోష్ వేయగా.. డార్లింగ్ ఈజ్ బ్యాక్.. సలార్ మైండ్ బ్లోయింగ్ అంటూ సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు నీల్. ఇందులో ప్రభాస్ ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్‌తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇందులో జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్ కీలకపాత్రలు పోషించగా.. రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ సినిమా ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల అయ్యింది.
ఇప్పటికే థియేటర్లలో రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఈసినిమాకు ఉదయం నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో పైరసీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు మేకర్స్. దీంతో ప్రభాస్ అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. సలార్ సినిమాకు సంబంధించిన పైరసీ ఎక్కడైనా కనిపిస్తే తమ యాంటీ పైరసీ టీంకు తెలియజేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ట్విట్టర్ లో ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సీన్లను ఎవరైనా పోస్ట్ చేసిన తమకు తెలియజేయాలని కోరారు. ట్విట్టర్ లో మీరు పైరసీ కంటెంట్ చూస్తే X@BLOCKXTECHS అంటూ రీ ట్వీట్ చేయాలని అన్నారు. అలాగే ఏదైనా పైరసీ సైట్స్ లో సలార్ మూవీ లేదా సినిమాకు సంబంధించిన ఏ విషయం కనిపించినా REPORT@BLOCKXTECH.COM అనే మెయిల్ కు మెసేజ్ చేయాలని కోరారు నిర్మాతలు.
Watch #SalaarCeaseFire in cinemas near you. Don’t encourage piracy.
Please report pirated links to @blockxtechs & report@blockxtech.com#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur… pic.twitter.com/t8DswbQ643
— Hombale Films (@hombalefilms) December 21, 2023
ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత రాధేశ్యామ్, సాహో, ఆదిపురుష్ ప్రభాస్ నటించిన సినిమాలు నిరాశపరిచాయి. దీంతో ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ సినిమాపైనే పెట్టుకున్నారు. ఈక్రమంలో ఇప్పుడు సలార్ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ వస్తుంది. మరి ఇంకేందుకు ఆలస్యం.. సలార్ సినిమా కంటెంట్ ఎక్కడైనా పైరసీ జరిగినట్లు కనిపిస్తే వాటిని తొలగించేలా ఈ రెండు విషయాలను ఫాలో అయిపోండి.
Experience the epic action saga, #SalaarCeaseFire at your nearest cinemas from TODAY 🔥#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @vchalapathi_art @anbariv @SalaarTheSaga pic.twitter.com/44gzrsgv3k
— Hombale Films (@hombalefilms) December 21, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.