Mahesh Babu-Gautam: ఇండస్ట్రీలోకి మహేష్ వారసుడి ఎంట్రీ.. గౌతమ్ మనసులోని మాటను బయటపెట్టిన నమ్రత.. ఫోటో వైరల్..
ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న మహేష్.. ఫ్యామిలీకి సైతం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారన్న సంగతి తెలిసిందే. షూటింగ్ నుంచి సమయం దొరికితే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తుంటారు. అటు మహేష్ తనయ సితారకు మంచి ఫాలోయింగ్ ఉంది. డాన్స్ రీల్స్ చేయడం దగ్గర్నుంచి.. ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది సితార. ఇక మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని ప్రేక్షకులకు సుపరిచితమే.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరీ, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న మహేష్.. ఫ్యామిలీకి సైతం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారన్న సంగతి తెలిసిందే. షూటింగ్ నుంచి సమయం దొరికితే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తుంటారు. అటు మహేష్ తనయ సితారకు మంచి ఫాలోయింగ్ ఉంది. డాన్స్ రీల్స్ చేయడం దగ్గర్నుంచి.. ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది సితార. ఇక మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని ప్రేక్షకులకు సుపరిచితమే.
వన్ నేనొక్కడ్నే సినిమాతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు గౌతమ్. ఇందులో మహేష్ చిన్ననాటి పాత్రలో కనిపించి మెప్పించారు. ఆ తర్వాత మరే సినిమాలో కనిపించలేదు. అలాగే ఇటు సినిమా ఈవెంట్లలోనూ గౌతమ్ తక్కువగా కనిపిస్తుంటాడు. ఇటీవలే మహేష్ ఫౌండేషన్ సందర్శించి అక్కడి వివరాలను అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. కొన్ని రోజుల క్రితమే లండన్ లో ప్లస్ 2 చేసి ఇటీవలే న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ సతీమణి నమ్రత షేర్ చేసిన ఫోటో ఆకట్టుకుంటుంది.
అందులో గౌతమ్ ఒక పేపర్ పట్టుకొని ఉన్నాడు. “నేను పెద్దయ్యాక ఇండియాలో & అమెరికాలో యాక్టర్ అవుతాను” అని రాసి ఉంది. ఈ ఫోటోను షేర్ చేసిన నమ్రత.. ‘పలక మీద రాయడం దగ్గర్నుంచి స్క్రిప్ట్ రాయడం వరకు నీ కలలు.. సంకల్పంతో అనుకున్నది సాధిస్తావు. జీవితంలో వెలిగిపోవడానికి ఒక ఫుల్ సర్కిల్ ఇచ్చింది లైఫ్. నువ్వు నీ కోసం చేసుకున్న ఈ ప్రయాణంలో నీకు ఆనందం, విజయాలు మాత్రమే దక్కాలని కోరుకుంటున్నాను. లవ్ యు సో మచ్ ‘ అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం నమ్రత షేర్ చేసిన గౌతమ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మహేష్ వారసుడి ఆగమానం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. గౌతమ్ అమెరికా వెళ్లింది యాక్టింగ్ నేర్చుకోవడానికి అని.. త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.