Salaar Movie: ‘సలార్’ ఎఫెక్ట్.. చిన్న పృథ్వీరాజ్‏కు బంపర్ ఆఫర్ ఇచ్చిన హీరో..

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాతో మరో మాస్ హిట్ ఖాతాలో వేసుకున్నారు ప్రభాస్. ఇన్నాళ్లకు డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు ముందు ప్రమోషన్స్ నిర్వహించలేదు. ఇటు మీడియాతోనూ చిత్రయూనిట్ ఇంట్రాక్ట్ కాలేదు. కానీ విడుదలకు ముందే ఈ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఏవి యూనిట్ సభ్యులు షేర్ చేసుకోలేదు.

Salaar Movie: 'సలార్' ఎఫెక్ట్.. చిన్న పృథ్వీరాజ్‏కు బంపర్ ఆఫర్ ఇచ్చిన హీరో..
Salaar Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 24, 2023 | 9:31 AM

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టిస్తోన్న సినిమా ‘సలార్’. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తుంది. ఇప్పుడు ఎక్కడా విన్నా ఈ సినిమా పేరు మారుమోగుతుంది. మొదటి రోజే రూ.177 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ బ్రేక్ చేసింది సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాతో మరో మాస్ హిట్ ఖాతాలో వేసుకున్నారు ప్రభాస్. ఇన్నాళ్లకు డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు ముందు ప్రమోషన్స్ నిర్వహించలేదు. ఇటు మీడియాతోనూ చిత్రయూనిట్ ఇంట్రాక్ట్ కాలేదు. కానీ విడుదలకు ముందే ఈ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఏవి యూనిట్ సభ్యులు షేర్ చేసుకోలేదు. కేవలం టీజర్, ట్రైలర్ తోనే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పేశాడు నీల్.

ఇక శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోతో బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాలో ప్రభాస్, శ్రుతిహాసన్, పృథ్వీరాజ్, జగపతిబాబు కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. వీరు మాత్రమే కాకుండా.. ఈ చిత్రంలో ప్రభాస్,పృథ్వీరాజ్ చిన్ననాటి పాత్రలలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్స్‏ సైతం పాపులర్ అయ్యారు. తాజాగా ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చిన్ననాటి పాత్రలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ సినిమాలో చిన్నప్పటి పృథ్వీరాజ్ పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్ నటించాడు. ప్రస్తుతం తాను పదో తరగతి చదువుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

తన సొంతూరు ప్రకాశం జిల్లా అని.. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ లో సెటిల్ అయ్యామని అన్నాడు. ఓ కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా తనకు సలార్ ఆడిషన్ కు వెళ్లే ఛాన్స్ వచ్చిందని అన్నాడు. ఈ సినిమా ఆడిషన్స్ కు చాలా మంది వచ్చారని.. కానీ తనకు యాక్టింగ్ నచ్చడంతో ప్రశాంత్ నీల్ ఛాన్స్ ఇచ్చారని తెలిపాడు దేవ్. అయితే సలార్ సినిమాలో తన యాక్టింగ్ చూసి పృథ్వీరాజ్ తన నెక్ట్స్ సినిమాలో ఆఫర్ ఇచ్చాడని తెలిపాడు. లూసిఫర్ సీక్వెల్ లో పృథ్వీరాజ్ చిన్నప్పటి పాత్రకు తనను సెలక్ట్ చేశారని చెప్పుకొచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్