Pushpa 2 Movie: బటర్ ఫ్లై ఎఫెక్ట్.. సలార్ దెబ్బకు నైజాంలో కొండెక్కి కూర్చున్న పుష్ప..!
Pushpa 2 Movie: సలార్ దెబ్బతో పుష్ప 2 బిజినెస్ పెరుగుతుంది.. అల్లు అర్జున్ సినిమా బిజినెస్ ఆకాశమంత రేట్లకు పెరిగిపోయింది ఇప్పుడు. అదేంటి ప్రభాస్ సినిమా హిట్ అయితే అల్లు అర్జున్ సినిమాకు బిజినెస్ పెరగడం ఏంటి విచిత్రం కాకపోతే అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఇండస్ట్రీలో బటర్ ఫ్లై ఎఫెక్ట్ బాగా నడుస్తుంది. ఈ నేచర్‌లో ఎక్కడో జరిగే ఒక ఇన్సిడెంట్..

Pushpa 2 Movie
సలార్ దెబ్బతో పుష్ప 2 బిజినెస్ పెరుగుతుంది.. అల్లు అర్జున్ సినిమా బిజినెస్ ఆకాశమంత రేట్లకు పెరిగిపోయింది ఇప్పుడు. అదేంటి ప్రభాస్ సినిమా హిట్ అయితే అల్లు అర్జున్ సినిమాకు బిజినెస్ పెరగడం ఏంటి విచిత్రం కాకపోతే అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఇండస్ట్రీలో బటర్ ఫ్లై ఎఫెక్ట్ బాగా నడుస్తుంది. ఈ నేచర్‌లో ఎక్కడో జరిగే ఒక ఇన్సిడెంట్.. మరెక్కడో జరిగే ఇంకో ఇన్సిడెంట్‌కు లింక్ అయి ఉంటుంది అంటూ నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ చెప్పాడు కదా.. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఇదే జరుగుతుంది. ఇక్కడ ఒక పెద్ద సినిమా హిట్ అయి రికార్డు క్రియేట్ చేస్తే.. దాని తర్వాత అదే రేంజ్ ఉన్న పెద్ద సినిమా బిజినెస్‌పై చాలా ప్రభావం చూపిస్తుంది.
కావాలంటే బాహుబలి సినిమానే తీసుకోండి. దానికి ముందు తెలుగు సినిమా బిజినెస్ కేవలం రూ.50 కోట్లు మాత్రమే. ఎంత పెద్ద సినిమా వచ్చినా రూ.50 కోట్ల కంటే ఎక్కువగా అమ్మేవారు కాదు. ఎందుకంటే అంత రావాలన్నా కూడా ఎన్నో అద్భుతాలు జరగాలి కాబట్టి. సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చినా కూడా లాంగ్ రన్ లేకపోతే రూ.50 కోట్లు వచ్చేవి కాదు బాహుబలి సినిమా రాకముందు వరకు. కానీ బాహుబలి వచ్చిన తర్వాత రూ.50 కోట్ల బిజినెస్ కాస్తా రూ.100 కోట్లు అయింది.. ఇప్పుడు 100 కోట్లు కూడా కాదు 150 కోట్ల వైపు పరుగులు పెడుతున్నాయి తెలుగు సినిమాలు. అందులోనూ నైజాం మార్కెట్ లెక్కకు మించి వసూలు చేస్తుంది.
మొన్నటి వరకు సలార్ సినిమా నైజాంలో రూ.60 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించడం చాలా కష్టం అనుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సలార్ సినిమాను రూ.60 కోట్లకు కొంటే బిజినెస్ తెలియదు అన్నట్లు చూశారు. కానీ కేవలం 9 రోజుల్లోనే రూ.60 కోట్లు దాటడం కాదు.. ఏకంగా రూ.70 కోట్లు షేర్ తీసుకొచ్చి రూ.10 కోట్లు లాభాలను బయ్యర్లకు చూపించింది సలార్. దాంతో మైత్రి మూవీ మేకర్స్ లెక్క తప్పలేదని.. వాళ్లు ఫుల్ క్లారిటీగానే ఉన్నారనే విషయంపై అందరికీ క్లారిటీ వచ్చింది.
ఇప్పుడు పుష్ప 2 కూడా వాళ్ల చేతుల్లోనే ఉంది. పైగా అది వాళ్ళ సొంత సినిమా. అన్నింటికీ మించి మూడేళ్ల కింద పుష్ప నైజాంలో రూ.40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. దాంతో సీక్వెల్‌కు ఏకంగా రూ.70 కోట్ల బిజినెస్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు. సలార్ రిజల్ట్ చూడక ముందు వరకు అయితే 70 కోట్లు అంటే కళ్ళు తేలేసేవాళ్ళు.. కానీ ఇప్పుడు అలా కాదు సలార్ ఫలితం చూసాక కచ్చితంగా నైజాంలో ఈ నెంబర్ సాధ్యమే అనే నమ్మకం వచ్చింది. అందుకే పుష్ప సీక్వెల్ బిజినెస్ నెక్స్ట్ లెవెల్‌లో జరుగుతుంది. 2024 ఆగస్ట్ 15న విడుదల కానుంది పుష్ప 2.