AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eagle: సంక్రాంతి రేస్ నుంచి రవితేజ ఈగల్ తప్పకుందా..? అసలు విషయం ఏంటంటే

సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ సినిమాతో పాటు మరికొంతమంది సినిమాలు కూడా ఈ సంక్రాంతికి సందడి చేయనున్నాయి. గుంటూరు కారం సినిమాతో పాటు.. వెంకటేష్ సైందవ్, నాగార్జున నా సామిరంగ, తేజ సజ్జ హనుమాన్, రవితేజ ఈగల్ సినిమాలు పోటీ పడనున్నాయి. 

Eagle: సంక్రాంతి రేస్ నుంచి రవితేజ ఈగల్ తప్పకుందా..? అసలు విషయం ఏంటంటే
Eagle
Rajeev Rayala
|

Updated on: Jan 04, 2024 | 3:58 PM

Share

సంక్రాంతి అంటేనే సినిమాల సీజన్. పెద్దపండగకు పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఈసారి సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ ఉండనుంది. సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ సినిమాతో పాటు మరికొంతమంది సినిమాలు కూడా ఈ సంక్రాంతికి సందడి చేయనున్నాయి. గుంటూరు కారం సినిమాతో పాటు.. వెంకటేష్ సైందవ్, నాగార్జున నా సామిరంగ, తేజ సజ్జ హనుమాన్, రవితేజ ఈగల్ సినిమాలు పోటీ పడనున్నాయి.

అయితే ఈ పోటీతో కొన్ని సినిమాలకు థియేటర్స్ దొరకడం కష్టంగానే కనిపిస్తుంది. ఈ క్రమంలో ఐదు సినిమాలనుంచి ఏదైనా సినిమా తప్పుంకుంటుందా..? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఎవ్వరూ కూడా వెనక్కి తగ్గడంలేదు. అయితే రవితేజ ఈగల్ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుందంటూ ఇప్పుడు ప్రచారం జరిగుతోంది. వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న రవితేజ ఈగల్ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ధమాకా సినిమా తర్వాత రవితేజ సినిమాలన్నీ డిజాస్టర్ అవుతున్నాయి.

ఇక ఇప్పుడు ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జనవరి 13న ఈగల్ సినిమాను రిలీజ్ చేయనున్నాం అని ముందే అనౌన్స్ చేశారు. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయ్యింది. ఈగల్ సినిమాకు యూ/ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. అయితే సంక్రాంతి రేస్ నుంచి ఈగల్ సినిమా తప్పునుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా  భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈగల్‌ సినిమా సింగిల్ గా వస్తేనే బెటర్ అని అంటున్నారు విశ్లేషకులు. ఇంతవరకు రిలీజ్ వాయిదా పై చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే దేనికి పై అప్డేట్ వచ్చే అవకాశం ఉందని టాక్. మరి పొంగల్ రేస్ నుంచి ఈగల్ నిజంగానే తప్పుకుంటుందా చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్