AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో పాపం.! ఒక్క రోజు సెలవు ఇవ్వండి.. వెక్కి వెక్కి ఇచ్చిన ఏడ్చిన స్టార్ హీరోయిన్

చాలా మంది హీరోయిన్స్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలను లైనప్ చేసి ఫుల్ బిజీగా గడుపుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓకే హీరోయిన్ తనకు ఒక్క రోజు బ్రేక్ కావాలని ఏడ్చేసిందట.

అయ్యో పాపం.! ఒక్క రోజు సెలవు ఇవ్వండి.. వెక్కి వెక్కి ఇచ్చిన ఏడ్చిన స్టార్ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 23, 2026 | 10:41 AM

Share

చాలా మంది స్టార్ హీరోయిన్స్ హీరోలకు సమానంగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. యాక్షన్ సీన్స్, ఫైట్స్ , ఎమోషనల్ సీన్స్ లో హీరోలతో పోటీపడుతూ ఎంతో మంది అందాల భామలు అదరగొడుతున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోదు. ఆమె సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అవుతుంది. హీరోలకు మించి క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగని ఆమె ఫైట్స్, స్కిన్ షో , స్పెషల్ సాంగ్స్ గట్రా చేయదు. కేవలం తన నటనతోనే కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగు , తమిళ్, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ నటిస్తూ యమా బిజీగా ఉన్న ఆ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇది కూడా చదవండి: 60మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా టచ్ చేయని రికార్డ్ ఆయనది

వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ఆమె ఒకానొక టైంలో ఒక్క రోజు సెలవు కోసం ఏడ్చేసిన సందర్భం కూడా ఉందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు తెలుగు ప్రేక్షకుల అభిమాన నటి సాయి పల్లవి. చూడటానికి పక్కింటి అమ్మాయిలా ఉండే సాయి పల్లవి తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ అమ్మడి నటనకు ఫిదా అవ్వని కుర్రాడు ఉండడు. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది సాయి పల్లవి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: రాత్రంతా స్పెషల్ సాంగ్ షూటింగ్.. తెల్లవారితే పెళ్లి..! ఈ హీరోయిన్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

బాలీవుడ్ లో రామాయణం సినిమాతో పాటు మరో సినిమా చేస్తుంది. ఇదిలా ఉంటే ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. “మాములుగా అయితే నేను ఒకేసారి ఒక సినిమా మాత్రమే చేస్తాను. కానీ, కోవిడ్ తర్వాత అనుకోకుండా ఒకేసారి మూడు సినిమాలు చేయాల్సి వస్తుంది. ఒకే సారి మూడు సినిమాలు చేయడంతో నాకు షూటింగ్స్ కు గ్యాప్ దొరకడం లేదు. నిజానికి కంటిన్యూగా పనిచేయడం నాకు అలవాటు లేదు. దాంతో చాలా ఇబ్బంది పడ్డాను. ఒక్క రోజు కూడా సెలవు దొరకడం లేదని ఏడ్చేశా కూడా.. కానీ ఆ విషయం గురించి ఏ నిర్మాతకు, దర్శకుడికి గానీ చెప్పలేదు. ఎందుకంటే నా వల్ల ఏ సినిమాకు ఇబ్బంది కలగడం నాకు ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ కామెంట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఇద్దరితో ఎఫైర్, ఇద్దరితో విడాకులు..!ఈ టాలీవుడ్ హీరో మామూలోడు కాదు గురూ..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఫైబర్, ప్రోటీన్, కాల్షియం.. ఈ ఇడ్లీలు తింటే అదుర్స్ అనాల్సిందే
ఫైబర్, ప్రోటీన్, కాల్షియం.. ఈ ఇడ్లీలు తింటే అదుర్స్ అనాల్సిందే
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?
బరువు తగ్గాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టాలా? మందార టీ మీకోసమే!
బరువు తగ్గాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టాలా? మందార టీ మీకోసమే!
ఎండలో అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?
ఎండలో అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?
కోహ్లీ విశ్వరూపం.. సరికొత్త చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..!
కోహ్లీ విశ్వరూపం.. సరికొత్త చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..!
టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సీజన్ 2 ఛాంపియన్‌గా టాటా గ్రూప్
టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సీజన్ 2 ఛాంపియన్‌గా టాటా గ్రూప్
అది ఇది తిని బోర్ కొట్టిందా..? కమ్మటి పెసర పునుగులు ఇలా చేయండి
అది ఇది తిని బోర్ కొట్టిందా..? కమ్మటి పెసర పునుగులు ఇలా చేయండి
గోవా వెళ్లాలనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ఇక ప్రతీరోజూ ట్రైన్
గోవా వెళ్లాలనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ఇక ప్రతీరోజూ ట్రైన్