AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: అది చూసి ఎంతో బాధపడ్డాను.. నేను చెప్పిన ఎవరూ అర్థం చేసుకోలేదు.. సాయి పల్లవి ఎమోషనల్..

సాయి పల్లవి ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రేమమ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి.. ఇప్పుడు టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది.

Sai Pallavi: అది చూసి ఎంతో బాధపడ్డాను.. నేను చెప్పిన ఎవరూ అర్థం చేసుకోలేదు.. సాయి పల్లవి ఎమోషనల్..
Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: Nov 30, 2024 | 9:31 PM

Share

దక్షిణాది సినీప్రియులకు అత్యంత ఇష్టమైన హీరోయిన్ సాయి పల్లవి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరూ సమానంగా ఇష్టపడే అతికొద్దిమంది నటీమణులలో సాయిపల్లవి ఒకరు. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. అద్భుతమైన నటనతో మెప్పించింది. అందం, అభినయంతో అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఇటీవలే అమరన్ సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శివకార్తికేయన్ హీరోగా డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. మరోవైపు రామాయణం సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. అయితే సాయి పల్లవి ప్రతి సినిమా విడుదలకు ముందు ఏదోక విషయంలో ఆమె పై ట్రోల్స్ జరుగుతుంటాయి. గతంలో ఆమె మాట్లాడిన మాటలను మళ్లీ షేర్ చేస్తూ ఆమె పై విమర్శలు చేస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తన మాటలు ఎందుకు నెట్టింట ట్రోల్స్ చేస్తుంటారనే విషయంపై స్పందించింది.

కొన్నేళ్ల క్రితం తనను మలయాళీ అని పిలిచినందుకు ఓ రిపోర్టర్‌పై ఆమె సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయని.. అవి చూసి తాను ఎంతో బాధపడ్డానని వెల్లడించింది. కేరళ నుంచి తనకు లభిస్తున్న ప్రేమ, ఆదరణ చాలా పెద్దదని చెబుతూ.. ‘ప్రేమమ్‌’ సినిమా నన్ను ఈరోజు చూస్తున్న వ్యక్తిగా మార్చిందని చెప్పుకొచ్చింది.

గలాటా ప్లస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. “మూడు నాలుగేళ్ల క్రితం నేను మీడియాతో మాట్లాడుతున్నాను. అప్పుడు ప్రెస్ మీట్ లేదు. ఇంకా కెమెరాలను ఆన్ చేయలేదు. మలయాళ నటీనటులందరూ ఇంత బాగా తెలుగు ఎలా మాట్లాడుతారని ఓ విలేఖరి నన్ను అడిగాడు. నేను మలయాళీని కాదు, తమిళనాడు నుంచి వచ్చాను అని చెప్పాను. ఆ తర్వాత ఏడాది లేదా రెండు సంవత్సరాల తర్వాత ఓ ప్రముఖ దినపత్రిక ‘సాయి పల్లవి తనని మలయాళీ అని పిలిచినందుకు రిపోర్టర్‌పై సీరియస్ అయ్యింది అంటూ పెద్ద హెడ్డింగ్ ఇచ్చింది. అది చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నేను కేరళ కదా.. తమిళనాడు నుంచి వచ్చానని మాత్రమే చెప్పాను.

ఇదంతా జరిగిన తర్వాత ఒకరోజు ఎయిర్‌పోర్ట్‌లో ఒక మహిళ నా దగ్గరకు వచ్చి మలయాళంలో మాట్లాడింది. అప్పుడు హఠాత్తుగా ‘అయ్యో సారీ, నేను మలయాళంలో మాట్లాడితే నీకు కోపం రాదు కదా అని అడిగింది. అది విని మరింత బాధపడ్డాను. నేను అలా అనలేదు. ప్రతిసారి నేను వివరిస్తాను. నాకు కేరళ నుంచి నాకు చాలా ప్రేమ వస్తోంది. ‘ప్రేమమ్‌’ సినిమా నన్ను ఈరోజు ఉండేలా చేసింది. నేనెప్పుడూ అలా చెప్పను” అంటూ చెప్పుకొచ్చింది.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..