Sai Dharam Tej: బిగ్ న్యూస్.. యాక్సిడెంట్ అనంతరం తొలిసారి సాయి ధరమ్ తేజ్ ట్వీట్..

బిగ్ న్యూస్. మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అనంతరం తొలిసారి సోషల్ మీడియా వేదికగా అభిమానులను పలుకరించారు.

Sai Dharam Tej: బిగ్ న్యూస్.. యాక్సిడెంట్ అనంతరం తొలిసారి సాయి ధరమ్ తేజ్ ట్వీట్..
Sai Dharam Tej
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 03, 2021 | 6:21 PM

బిగ్ న్యూస్. మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా తన ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ వేశారు. ఆల్ ఈజ్ వెల్ అంటూ థంబ్ సైన్ చూపించారు. కష్టసమయంలో అభిమానులు, ఆప్తులు, స్నేహితులు చూపించిన ప్రేమ, అభిమానానికి థాంక్స్ అనే పదం చిన్నదవుతుందని పేర్కొన్నాడు. తన రిపబ్లిక్ మూవీని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. త్వరలో అందర్నీ కలుస్తానంటూ ట్వీట్ ముగించాడు. దీంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మాదాపూర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తూ..  తేజ్ స్కిడ్‌ అయి పడిపోయారు. స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్‌‌లో షిఫ్ట్ చేశారు. అక్కడ చికిత్స అనంతరం.. కాలర్ బోన్ ఫ్యాక్చర్‌‌‌కు డాక్టర్ల టీమ్ సర్జరీ చేసింది. కాగా అప్పట్నుంచి డాక్టర్ల అబ్జర్వేషన్‌లో ఆస్పత్రిలో ఉంటున్నాడు తేజ్. ప్రస్తుతం ఆయన కోలకుంటూ ఉండటం.. స్వయంగా ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి.  అయితే ప్రమాద సమయంలో సాయి తేజ్ హెల్మెట్ ధరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అందుకే బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. కాగా సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ అక్టోబర్ 1న విడుదలై.. మంచి టాక్‌తో ముందుకు వెళ్తోంది.

Also Read: సిద్దార్థ్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన పూనమ్ కౌర్.. తన మార్క్ కామెంట్.. అంతా గందరగోళం

 నర్మగర్భంగా మరో పోస్ట్ పెట్టిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్‌ జుకల్కర్‌.. నెట్టింట వైరల్