Shruti Haasan: బాయ్‌ఫ్రెండ్‎తో ఎంజాయ్ చేస్తున్న శృతి హాసన్.. ఇన్‎స్టాలో ఫొటోలు..

హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తనకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు...

Shruti Haasan: బాయ్‌ఫ్రెండ్‎తో ఎంజాయ్ చేస్తున్న శృతి హాసన్.. ఇన్‎స్టాలో ఫొటోలు..
Sruthi
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 03, 2021 | 7:18 PM

హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తనకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఆమె తన బాయ్‌ఫ్రెండ్ సంతను హజారికతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. శృతి అక్టోబర్ 2 న బాయ్‌ఫ్రెండ్ సంతను హజారికతో కలిసి షాపింగ్ మాల్‎కు వెళ్లారు. అక్కడ ఆమె దిగిన ఫొటోను తన ఇన్‎స్టాలో పోస్ట్ చేశారు. తన బాయ్‌ఫ్రెండ్ సంతను హజారికతో దిగిన మరో ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఇందులో మొదటి ఫోటోలో శృతి హాసన్ సూపర్ మార్కెట్ వద్ద నిలబడి ఉంది. రెండో ఫోటోలో శ్రుతి తన బాయ్‌ఫ్రెండ్, సంతను హరాజికాతో కలిసి ఉంది. తన ఇంటి సరకుల కోసం షాపింగ్ చేయడం సంతోషంగా ఉందంటూ శృతి రాసుకొచ్చారు. శృతి హాసన్, సంతను హజారిక గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారు. ఇటీవల శృతి హాసన్, తన సోదరి అక్షర హాసన్‎.. రానా దగ్గుబాటితో కలిసి ఒక మ్యూజిక్ వీడియో చేశారు. ఈ మ్యూజిక్ వీడియో రానా యొక్క యూట్యూబ్ ఛానల్ “సౌత్ బే” కోసం చేశారు. త్వరలో మ్యూజిక్ వీడియో విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

2020 లాక్‎డౌన్ సమయంలో, శృతి హాసన్ తన ప్రియుడు సంతను హజారి, ఆమె పెంపుడు పిల్లి క్లారాతో గడిపారు. ఆ తర్వాత నుంతి ఆమె ఇన్‎స్టాలో తను నటించబోయే చిత్రాలను పంచుకుంటున్నారు. శృతి చివరిసారిగా లాబామ్‌లో నటించారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సాలార్ సినిమాలో శృతి నటిస్తోంది. సాలార్ ఏప్రిల్ 14, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది. శృతి హిందీలో వెబ్ సిరీస్‎లో నటిస్తోంది.

Rea Also.. Sonakshi Sinha: ఐదేళ్లు అతడితో రిలేషన్‌లో ఉన్నా.. ఆసక్తిగా విషయాలు తెలిపిన బాలీవుడ్ బ్యూటీ..