Sai Dharam Tej: మెగా మేనల్లుడిపై ఆ హీరోయిన్‌ మనసు పడిందా? మరోసారి నా తేజు అంటూ ..

|

Oct 16, 2022 | 3:16 PM

శనివారం ( అక్టోబర్‌15) మెగా హీరో పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'హ్యాపీ బర్త్‌డే మై తేజు' అంటూ లవ్‌ సింబల్‌ని జత చేసింది. దీనికి 'నన్ను నిరంతరం డిస్ట్రబ్‌ చేసే వ్యక్తి' అంటూ సాయి ఆమెకు థ్యాంక్స్‌ చెబుతూ లవ్‌ ఎమోజీలు పెట్టాడు. దీంతో పాటు ఆమెతో సరదాగా దిగిన ఓ ఫొటో షేర్‌ చేశాడు.

Sai Dharam Tej: మెగా మేనల్లుడిపై ఆ హీరోయిన్‌ మనసు పడిందా? మరోసారి నా తేజు అంటూ ..
Sai Dharam Tej, Larissa
Follow us on

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన చిత్రాల్లో తిక్క కూడా ఒకటి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బోల్తా కొట్టినప్పటికీ ఇందులో నటించిన హీరోయిన్‌ మాత్రం తరచూ అందరినోళ్లల్లో నానుతోంది. బ్రెజిలియన్ మోడల్ లారిస్సా బొనేసి. ఆ సినిమా సమయంలోనే వీరికి మంచి స్నేహం కుదిరింది. డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అందుకు తగ్గట్లే తరచూ తేజ్‌పై సోషల్‌ మీడియా వేదికగా పలు ఆసక్తికర పోస్ట్‌లు పెట్టింది లారిస్సా. తాజాగా వీరిద్దరూ మరోసారి వార్తల్లో నిలిచారు. సాయి తేజ్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ ముద్దుగుమ్మ చేసిన ట్వీటే దీనికి కారణం. శనివారం ( అక్టోబర్‌15) మెగా హీరో పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌డే మై తేజు’ అంటూ లవ్‌ సింబల్‌ని జత చేసింది. దీనికి ‘నన్ను నిరంతరం డిస్ట్రబ్‌ చేసే వ్యక్తి’ అంటూ సాయి ఆమెకు థ్యాంక్స్‌ చెబుతూ లవ్‌ ఎమోజీలు పెట్టాడు. దీంతో పాటు ఆమెతో సరదాగా దిగిన ఓ ఫొటో షేర్‌ చేశాడు.

నీ నవ్వు చూడడానికి..

ఈ ట్వీట్లు చూసిన అభిమానులు, నెటిజన్లు.. మీరు ‘ప్రేమలో ఉన్నారా?’ అని అడుగుతున్నారు. కాగా గతేడాది కూడా తేజు బర్త్‌ డే రోజే ‘నేను ప్రేమలో ఉన్నాను’ అంటూ లారిస్సా ట్వీట్‌ చేసి సరికొత్త చర్చకు దారి తీసింది. వారు ప్రేమలో ఉన్నారనే రూమర్స్ ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఇక తేజు గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు కూడా ఒక ఆసక్తికర పోస్ట్‌ పెట్టింది. ఆ సమయంలో ఆస్పత్రిలో ఉన్న తేజు త్వరగా కోలుకోవాలంటూ లారిస్సా ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది. ‘నీ నవ్వుని మళ్లీ చూడటానికి ఎదురుచూస్తున్నా. నమ్ము తేజు’ అని అందులో రాసుకొచ్చింది. దీనిలో కూడా ‘నా తేజు’ అంటూ లారిస్సా రాయడం విశేషం.

కాగా తిక్క సినిమా తర్వాత లారిస్సా తెలుగు తెరపై ఎక్కువగా కనిపించలేదు. సందీప్‌ కిషన్‌ నటించిన నెక్ట్స్‌ ఏంటిలో ఒక చిన్న పాత్రలో మాత్రమే నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..