Kartikeya Gummakonda: చడీచప్పుడు లేకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్న కుర్ర హీరో.. వైరల్ అవుతున్న ఫోటోలు..
ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయం అందుకున్న యంగ్ హీరో కార్తికేయ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా..

Kartikeya: ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయం అందుకున్న యంగ్ హీరో కార్తికేయ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా ఓవర్ నైట్‌లో విపరీతమైన క్రేజ్‌ను తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ కుర్రహీరో. హీరోగానే కాకుండా విలన్‌గాను మెప్పిస్తున్నాడు కార్తికేయ. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్‌గా నటించి ఆకట్టుకున్నాడు. ఇక తెలుగులోనే కాదు ఇటీవల తమిళ్ ఇండస్ట్రీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు. అజిత్ నటిస్తున్న వలిమై అనే సినిమాలో కార్తికేయ విలన్‌గా నటించబోతున్నాడు. ఇక రీసెంట్‌గా చావు కబుర్రు చల్లగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే ఈ కుర్ర హీరో ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా పెళ్లిపీటలెక్కేందుకు సిద్దమయ్యాడు. సిక్రెట్‌గా ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్నాడు. కార్తికేయ ఎంగేజ్మెంట్ ఫోటోలు సడన్‌గా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవ్వడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అయితే ప్రస్తుతం అమెరికాలో ఉన్న కార్తికేయ అక్కడి నుంచి వచ్చిన వెంటనే నిశ్చితార్థంపై అధికారిక ప్రకటన చేయనున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పెళ్లికూతురు కార్తికేయ ఫ్రెండ్ అని సమాచారం. తన ప్రియురాలైన లోహితా రెడ్డితో కార్తికేయ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే వీరి పెళ్ళికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. ఇక ఇప్పుడు కార్తికేయ ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కార్తికేయ ప్రస్తుతం రాజా విక్రమార్క అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. అలాగే త్వరలోనే అజిత్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవ్వనున్నాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :




