Telugu News Entertainment Tollywood RRR stars Jr NTR and Ram Charan are ‘together forever’ as they walk on the streets of Japan with their wives watch video Telugu Cinema News
Ramcharan-NTR: గులాబీ పూలతో చేతిలో చెయ్యి వేసుకుని.. జపాన్ రోడ్లపై చెర్రీ, తారక్ ఫ్యామిలీల దోస్తీ.. ఫ్యాన్స్ ఫిదా
జపాన్‌కు చెర్రీ సతీమణి ఉపాసన, ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి కూడా వెళ్లారు. తాజాగా ఈ జంటలు జపాన్ వీధుల్లో సందడి చేశాయి. రద్దీగా ఉండే ప్రాంతంలో సతీసమేతంగా నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు.
ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఇప్పుడు విదేశాల్లో సత్తా చాటుతోంది. ఇప్పటికే అమెరికాలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక అక్టోబర్ 21న జపాన్‌లో రిలీజైన ఈ విజువల్ వండర్‌కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ మూవీ ప్రమోట్ కోసం రామ్‌చరణ్, తారక్‌తో పాటు దర్శకుడు రాజమౌళి జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఇదిలా ఉంటే చెర్రీ, ఎన్టీఆర్‌లను కలిసేందుకు జపనీస్ అభిమానులు క్యూ కడుతున్నారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీపడుతున్నారు. కాగా జపాన్‌కు చెర్రీ సతీమణి ఉపాసన, ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి కూడా వెళ్లారు. తాజాగా ఈ జంటలు జపాన్ వీధుల్లో సందడి చేశాయి. రద్దీగా ఉండే ప్రాంతంలో సతీసమేతంగా నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. గులాబీ పువ్వులను పట్టుకుని, ఒకరి చేతిలో మరొకరు చెయ్యి వేసుకుని ముందుకు సాగారు. దీనికి సంబంధించిన వీడియోకు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని దోస్తీ పాటను జతచేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు రామ్‌చరణ్. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు ఈ జంటలను చూసి ఫిదా అవుతున్నారు.
రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌లో చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో.. తారక్.. కొమురం భీమ్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక చెర్రీ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో RC 15 (వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక తారక్ విషయానికొస్తే.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. NTR 30 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పనిచేయనున్నారు.