AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR: జపాన్‌లో ఎన్టీఆర్‌ క్రేజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. కంటతడి పెట్టుకుంటున్న అభిమానులు.. వీడియో వైరల్‌..

జపాన్‌లో ఇండియన్‌ మూవీస్‌కు ఎంతో మంది అభిమానులు ఉంటారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా సౌత్‌ ఇండియాకు చెందిన హీరోలపై జపన్‌ దేశస్థులకు ఎక్కడలేని అభిమానం. అప్పట్లో రజినీకాంత్‌ చిత్రాలు ఎక్కువగా జపాన్‌ విడుదలవుతుండేవి. అయితే తాజాగా ఈ జాబితాలోకి జూనియర్‌...

NTR: జపాన్‌లో ఎన్టీఆర్‌ క్రేజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. కంటతడి పెట్టుకుంటున్న అభిమానులు.. వీడియో వైరల్‌..
Ntr Fans In Japan
Narender Vaitla
|

Updated on: Oct 22, 2022 | 6:50 AM

Share

జపాన్‌లో ఇండియన్‌ మూవీస్‌కు ఎంతో మంది అభిమానులు ఉంటారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా సౌత్‌ ఇండియాకు చెందిన హీరోలపై జపన్‌ దేశస్థులకు ఎక్కడలేని అభిమానం. అప్పట్లో రజినీకాంత్‌ చిత్రాలు ఎక్కువగా జపాన్‌ విడుదలవుతుండేవి. అయితే తాజాగా ఈ జాబితాలోకి జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా వచ్చి చేరారు. తాజాగా ట్రిపులార్‌ సినిమా జపాన్‌లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో పాటు దర్శకుడు రాజమౌళి కూడా ప్రమోషన్స్‌లో భాగంగా జపాన్‌లో సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తారక్‌ జపాన్‌లో అభిమానులతో గడుపుతున్నారు. జపాన్‌కు చెందిన వారు తారక్‌పై చూపిస్తున్న అభిమానానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. తారక్‌తో అక్కడి వారు సెల్ఫీలు దిగడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది అభిమానులైతే తారక్‌ను చూశామన్న సంతోషంతో ఏకంగా కంటతడి పెట్టుకున్నారు. ఇక ట్రిపులార్‌ సినిమా కంటే ముందే ఎన్టీఆర్‌కు వీరాభిమానులుగా మారినట్లు తెలుస్తోంది. సింహాద్రి, యమదొంగ సినిమా క్యాసెట్లపై అభిమానులు ఆటోగ్రాఫ్స్‌ తీసుకోవడం దీనికి సాక్ష్యంగా చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ట్రిపులార్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తారక్‌ జపాన్‌ భాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఏమాత్రం తడబడకుండా ఎన్టీఆర్‌ జపాన్‌ భాషలో మాట్లాడిన విధానం అక్కడి వారికి సైతం ఆకట్టుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ జపాన్‌ స్పీచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో జూనియర్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..