మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన బాక్సాఫీస్ సెన్సెషనల్ ఆర్ఆర్ఆర్. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం భారత దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. జక్కన్న టేకింగ్.. చరణ్, తారక్ నటనకు హాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ప్రశంసలు కురిపించారు. ఇప్పటివరకు ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్… తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద అవార్డును కైవసం చేసుకుంది. సన్‌సెట్ సర్కిల్ అవార్డ్స్ 2022లో ‘ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్’గా ఆర్ఆర్ఆర్ నిలిచింది.
నాలుగు ఇతర ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో నామినేట్ అయిన ఆర్‌ఆర్‌ఆర్ ఫైనల్‌గా విన్నర్‌గా నిలిచింది. ఈ పురస్కారం రావడం పట్ల చిత్రయూనిట్ చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా జక్కన్న టీంకు సినీ జనాలు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి ఆర్ఆర్ఆర్ వెళ్తుందని చాలా మంది సినీ ప్రియులు ఆశించారు. కానీ ఈ సినిమా స్థానంలో చలో షో ఎంపికైన సంగతి తెలిసిందే.
ఇక ఇటీవల జపాన్ లో విడుదలైన ఈ మూవీ అక్కడ కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. పీరియాడికల్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, అలియా భట్, శ్రియా, సముద్రఖని కీలకపాత్రలలో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.