RRR – NTR: ట్రిపులార్ సినిమా గురించి ఇజ్రాయెల్ ప్రత్యేక కథనం.. వైరల్ అవుతున్న పేపర్ క్లిప్స్..!
RRR - NTR: బాహుబలి మూవీతో దేశంలో రికార్డులు సృష్టించిన జక్కన్న, ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో దేశ సరిహద్దులు దాటారు. అంతర్జాతీయంగానూ తన గురించి,
RRR – NTR: బాహుబలి మూవీతో దేశంలో రికార్డులు సృష్టించిన జక్కన్న, ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో దేశ సరిహద్దులు దాటారు. అంతర్జాతీయంగానూ తన గురించి, తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు.ఇటీవల విడుదలైన ట్రిపులార్ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత ఓటీటీల్లోకి రావడంతో ఈ సినిమా రేంజ్‌ను మరో లెవల్‌కు వెళ్లింది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేయడం, ట్రిపులార్‌ను ప్రపంచంలోని ఎంతోమంది సినీ ప్రముఖుల దృష్టిలో పడేలా చేసింది. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై ఎంతోమంది హాలీవుడ్ డైరెక్టర్లు, రైటర్లు ప్రశంసలు కురిపించారు. నాన్ ఇంగ్లిష్ మూవీస్ కేటగిరీలో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత రోటెన్ టొమాటోస్‌లో హాలీవుడ్ మూవీ బ్యాట్‌మ్యాన్ కంటే కూడా ఎక్కువ రేటింగ్ సాధించింది మన ట్రిపులార్.
ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నో ఘనతలు సాధించింది. ఇక తాజాగా, ప్రముఖ ఇజ్రాయెల్ పత్రిక కూడా ట్రిపులార్ గురించి ప్రత్యేకంగా ఓ ఆర్టికల్‌ను ప్రచురింత చేసింది. ట్రిపులార్ సినిమాతోపాటు ఇందులో భీమ్ పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ పాత్ర గురించి ఆ పత్రిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. నిజానికి ఇందులో ఎన్టీఆర్ నటనకు ఫిదా కాని వాళ్లంటూ లేరు. హాలీవుడ్ మరచిపోయింది ఇదే, అంటూ హెడింగ్ పెట్టి మరీ ఆ పత్రిక ట్రిపులార్ సినిమాను ప్రశంసించింది. ఈ వార్తకు సంబంధించిన క్లిప్పింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్లిప్పింగ్‌ను చూసిన నెటిజన్లు, దటీజ్ జక్కన్న, ఎన్టీఆర్ సూపర్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత, రాజమౌళిదేనని కొనియాడుతున్నారు.