Roshan Kanakala: అమ్మ బాధను చూడలేకపోయాను.. సుమతో రాజీవ్ కనకాల విడాకులు.. ? రోషన్ కామెంట్స్..

యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా రాణిస్తు్న్న సంగతి తెలిసిందే. ఇటీవల బబుల్ గమ్ సినిమాతో హీరోగా పరిచయమైన రోషన్.. ఇప్పుడు మోగ్లీ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో పాల్గొంటున్న రోషన్.. తన తల్లిదండ్రుల విడాకుల వార్తలు.. తన తండ్రికి, ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Roshan Kanakala: అమ్మ బాధను చూడలేకపోయాను.. సుమతో రాజీవ్ కనకాల విడాకులు.. ? రోషన్ కామెంట్స్..
Roshan

Updated on: Dec 12, 2025 | 8:27 PM

యాంకర్ సుమ.. తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. దశాబ్దాలుగా బుల్లితెరపై ఎన్నో టీవీ షోలు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లతో ఎప్పుడూ బిజీగా ఉంటారు. మరోవైపు రాజీవ్ కనకాల సైతం చేతినిండా సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తుంటారు. ఇప్పుడు సుమ, రాజీవ్ కనకాల దంపతుల తనయుడు రోషన్ కనకాల సైతం హీరోగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. బబుల్ గమ్ సినిమాతో హీరోగా పరిచయమైన రోషన్.. ఇప్పుడు మోగ్లీ సినిమాతో అడియన్స్ ముందుకు రానున్నాడు. కలర్ ఫోటో ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 13న విడుదల కానుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా తన మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు రోషన్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రోషన్ మాట్లాడుతూ.. తన తండ్రికి, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం, అలాగే తల్లిదండ్రులు సుమ, రాజీవ్ కనకాల విడాకులపై వచ్చిన వదంతుల గురించి స్పందించారు.

ఇవి కూడా చదవండి : Actress Vahini : అప్పుడు సీరియల్స్‏తో క్రేజ్.. క్యాన్సర్‏తో పోరాటం.. సాయం కోరుతూ పోస్ట్..

ఎన్టీఆర్, రాజీవ్ కనకాల స్నేహం స్టూడెంట్ నంబర్ వన్ సినిమా నుండి ప్రారంభమైందని రోషన్ స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్తలను ఆయన ఖండించారు. ఎన్టీఆర్ కథకు తగిన పాత్ర ఉంటేనే రాజీవ్ కనకాలను ఎంచుకుంటారని, ఇది వారి వృత్తి పరమైన సంబంధమని పేర్కొన్నారు. అదేవిధంగా, మూడు సంవత్సరాల క్రితం సుమ, రాజీవ్ కనకాల విడాకులు తీసుకుంటున్నారంటూ వచ్చిన రూమర్లపై రోషన్ స్పందించారు. ఈ వార్తలు తన కుటుంబానికి బాధ కలిగించినప్పటికీ, వారు ఆ వదంతులను పట్టించుకోలేదని తెలిపారు. తమ కుటుంబంలో అటువంటి సమస్యలు లేవని, బయట జరిగే ప్రచారాలకు ప్రాముఖ్యత ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారని రోషన్ వివరించారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Tollywood : అలాంటి సీన్స్ చేయడానికి ఓకే.. కానీ లిప్ లాక్ అతడికి మాత్రమే.. టాలీవుడ్ హీరోయిన్..

సుమ, రాజీవ్ కనకాల విడాకులు తీసుకుంటున్నారంటూ గత మూడు సంవత్సరాలుగా వచ్చిన రూమర్స్ పై రోషన్ స్పందించారు. ఈ వార్తలు తమ కుటుంబానికి చాలా బాధ కలిగించాయని, తమను ఎమోషనల్ గా ప్రభావితం చేశాయని అన్నారు. తమ కుటుంబంలో అటువంటి సమస్యలు లేవని తమకు స్పష్టంగా తెలుసని, కానీ బయట జరుగుతున్న ప్రచారం వల్ల తాము చాలా ఇబ్బంది పడ్డామని రోషన్ అన్నారు. మొదట్లో తన తల్లి సుమ కూడా ఈ రూమర్ల వల్ల బాధపడినా, చివరికి వాటిని పట్టించుకోవడం మానేశారని రోషన్ పేర్కొన్నారు. ఎందుకంటే తమ కుటుంబంలో ఏం జరుగుతుందో తమకు తెలుసని, ఇతరుల అభిప్రాయాలకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని తాము నిర్ణయించుకున్నామని రోషన్ స్పష్టం చేశారు. కుటుంబం విషయంలో ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత ధనవంతుడైనా మనుషులమేనని, ఎమోషనల్ బాండింగ్ ఉంటుందని, అటువంటి రూమర్స్ తమకు బాధను కలిగిస్తాయని రోషన్ అన్నారు. ప్రస్తుతం రోషన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..

ఇవి కూడా చదవండి : Tollywood : అవకాశం ఇస్తానని ఇంటికొచ్చి మరీ అలా ప్రవర్తించాడు.. గుప్పెడంత మనసు సీరియల్ నటి..