Aravind Swamy: రోజా హీరో అరవింద్ స్వామికి ఇంత పెద్ద కూతురు ఉందా..? వైరలవుతున్న ఫోటో..
డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో రోజా ఒకటి. 1992లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, మరాఠీ భాషలలో రిలీజ్ అయిన ఈ మూవీకి భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ శ్రోత హృదయాలను కట్టిపడేసే సంగీతాన్ని అందించాడు.

డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో రోజా ఒకటి. 1992లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, మరాఠీ భాషలలో రిలీజ్ అయిన ఈ మూవీకి భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ శ్రోత హృదయాలను కట్టిపడేసే సంగీతాన్ని అందించాడు. ఈ మూవీలో తమిళ్ నటుడు అరవింద్ స్వామి, మధూ హీరోహీరోయిన్లుగా నటించారు. అప్పట్లో వీరి జోడికి చాలా ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా అరవింద్ స్వామి స్మార్ట్ చాక్లెట్ బాయ్ అంటూ పిలుచుకునేవారు. 90వ దశకంలో అరవింద్ స్వామి టాప్ హీరో. రోజా సినిమా కంటే ముందు డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన తలపతి చిత్రంలో రజినీ, మమ్ముట్టితో కలిసి నటించారు. ఇందులో అరవింద్ స్వామి రూపం, అభియనం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఆ తర్వాత రోజా సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అరవింద్ స్వామికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బొంబాయి, అఖిత్రియా నామ్, అలైపాయుతే, మొహము మొదలైన పలు చిత్రాల్లో నటించి బాగా పాపులర్ అయ్యాడు. తమిళంతోపాటు హిందీలో అనేక సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అరవింద్ స్వామి ఉన్నట్లుండి సినిమాల నుంచి తప్పుకున్నాడు. కొన్నాళ్లపాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ఆయన.. వ్యాపారవేత్తగా రాణించాడు. అనేక రంగాల్లో వ్యాపారపెట్టుబడులతో బిజినెస్ మెన్ గా సక్సెస్ అయ్యాడు.
చాలా కాలం తర్వాత తిరిగి మళ్లీ మణిరత్నం దర్శకత్వంలో కాదల్ అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. కాదల్ తర్వాత థని ఒరువన్‌లో విలన్‌గా నటించిన మెప్పించాడు. హీరోగా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న అరవింద్ స్వామి.. థని ఒరువన్ సినిమాతో విలన్ గా కనిపించి మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా విలన్ పాత్రలు చేయడం స్టార్ట్ చేశాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధృవ సినిమాలో విలన్ గా కనిపించాడు. ప్రస్తుతం అరవింద్ స్వామి కూతురి ఫోటో నెట్టింట వైరలవుతుంది. 1994లో గాయత్రీ రామ్‌మూర్తిని వివాహం చేసుకున్నారు అరవింద్ స్వామి. 16 ఏళ్ల తర్వాత 2010లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. 2012లో అపర్ణను రెండో వివాహం చేసుకున్నారు. అరవింద్‌సామి వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు అరవింద్ స్వామి కూతురు అధిర ఫోటో నెట్టింట వైరలవుతుంది. రోజా హీరోకు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.