K.G.F Chapter 2: కేజీఎఫ్ 2 కోసం రాకీ భాయ్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
స్టార్ హీరోల రెమ్యునరేషన్‌ని విడదీసి మీమీ సినిమాల బడ్జెట్ లెక్కలు చూపించండి.. అంటూ కొన్ని ప్రభుత్వాలు నిర్మాతలకు కండిషన్స్ పెట్టడంతో.. ఏ హీరోకి ఎంతొస్తోంది అనే లెక్క రిసెంట్ టైమ్స్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.
స్టార్ హీరోల రెమ్యునరేషన్‌ని విడదీసి మీమీ సినిమాల బడ్జెట్ లెక్కలు చూపించండి.. అంటూ కొన్ని ప్రభుత్వాలు నిర్మాతలకు కండిషన్స్ పెట్టడంతో.. ఏ హీరోకి ఎంతొస్తోంది అనే లెక్క రిసెంట్ టైమ్స్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. లేటెస్ట్‌గా కేజీఎఫ్2(K.G.F Chapter 2) రిలీజయ్యాక.. స్టార్ కాస్ట్ అండ్ దెయిర్ శాలరీస్ అనే చర్చ మళ్లీ గట్టిగానే మొదలైంది. సినిమాలో క్వాలిటీ ఉంటే కలెక్షన్లు వాటంతటవే వస్తాయని రెండోసారి ప్రూవ్ చేసింది కేజీఎఫ్2. కానీ.. అలా క్వాలిటీ పెరగాలంటే డైరెక్టర్లే కాదు.. హీరోలు కూడా కాసింత పెద్ద మనసు చేసుకోవాలన్నది తాజాగా వినిపిస్తున్న సూచన. హీరోలకిచ్చే రెమ్యునరేషన్ ఖర్చు సినిమా ప్రొడక్షన్ మీద పెడితే, కేజీఎఫ్ లాంటి వండర్స్ ఇంకాఇంకా వస్తాయని కొట్టి చెబుతున్నారు డైరెక్టర్ వర్మ. శాండల్‌వుడ్ నుంచి బాలీవుడ్ మీదికి విసిరిన న్యూక్లియర్ బాంబు అంటూ కేజీఎఫ్2ని డిఫైన్ చేస్తున్నారు బాక్సాఫీస్ పండిట్స్. ఈ సినిమాలో మేకింగ్ వ్యాల్యూస్ దెబ్బకి.. హిందీ స్టార్ హీరోల ఓపెనింగ్ కలెక్షన్ లెక్కలన్నీ చెల్లాచెదరైన మాటైతే నిజం. బడ్జెట్‌లో అధికపక్షం ప్రొడక్షన్ మీద ఖర్చు పెట్టడమే కేజీఎఫ్ అంత రిచ్‌గా రావడానికి కారణమట.
ఫస్ట్ పార్ట్ ఘనవిజయం సాధించినా.. సెకండ్‌పార్ట్‌కి హీరోగా యష్ తీసుకుంది 30 కోట్లేనట. తర్వాత ప్రాఫిట్స్‌లో కూడా షేర్ తీసుకుంటారనేది వేరే మాట. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 15 కోట్లు, విలన్ పాత్రధారి సంజయ్‌దత్ 9 కోట్లు తీసుకున్నట్టు లెక్కలున్నాయి. ఏదేమైనా కేజీఎఫ్2 టోటల్ బడ్జెట్‌లో స్టార్ రెమ్యునరేషన్లు ఇరవై శాతానికి మించిపోలేదన్నది క్లియర్. మిగతా పెద్ద సినిమాల విషయంలో మాత్రం ఆ కాలిక్యులేషన్ వేరేగా వుంటోంది. ట్రిపులార్ బడ్జెట్‌లో 40 శాతం వరకూ హీరోల శాలరీకే సరిపోయింది. తెలుగు పరిశ్రమలో 60 కోట్లకు మించి చెక్కులు తీసుకునే హీరోలు అరడజను మంది దాకా వున్నారు. పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాల పరిస్థితైతే ఇంకా ఖరీదు. ఒక్కో సినిమాకు వంద కోట్లకు మించి చార్జ్ చేస్తున్నట్టు డార్లింగ్ కాంపౌండే క్లారిఫై చేస్తోంది. మరి… రాకీభాయ్‌లాగే మిగతా హీరోలు కూడా శాలరీలు తగ్గించుకుంటే, ప్రాడక్ట్ ఇంకాస్త రిచ్‌గా వచ్చే ఛాన్సుందన్నది వర్మ లాంటి అనుభవుజ్ఞులు చెప్పే మాట. మరి.. ఈ ప్రపోజల్‌ని కన్సిడర్ చేసే పెద్ద మనసు ఎంతమంది పెద్ద హీరోలకుందనేదే ప్రశ్న.
మరిన్ని ఇక్కడ చదవండి :