AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF 2 and Salaar: ప్రభాస్‌- యష్‌‌లతో మల్టీస్టారర్.. అదికూడా కేజీయఫ్‌, సలార్‌ల మిక్సింగ్‌‌తో..?

సినిమా అనేది పెద్ద ఇమాజినరీ వరల్డ్. ఊహ ఎంత కొత్తగా ఉంటే, ఆడియన్స్‌ నుంచి అంత యాక్సెప్టెన్స్ దొరుకుతుంది. ఇప్పుడు గాసిప్‌ కా బాప్‌ అన్నట్టు ఓ కాంబో గురించి నెట్టింట ఒపీనియన్స్ షేర్‌ అవుతున్నాయి.

KGF 2 and Salaar: ప్రభాస్‌- యష్‌‌లతో మల్టీస్టారర్.. అదికూడా కేజీయఫ్‌, సలార్‌ల మిక్సింగ్‌‌తో..?
Prabhas And Yash
Rajeev Rayala
|

Updated on: Apr 18, 2022 | 7:20 AM

Share

సినిమా అనేది పెద్ద ఇమాజినరీ వరల్డ్. ఊహ ఎంత కొత్తగా ఉంటే, ఆడియన్స్‌ నుంచి అంత యాక్సెప్టెన్స్ దొరుకుతుంది. ఇప్పుడు గాసిప్‌ కా బాప్‌ అన్నట్టు ఓ కాంబో గురించి నెట్టింట ఒపీనియన్స్ షేర్‌ అవుతున్నాయి. కేజీయఫ్‌(KGF 2) సెన్సేషన్‌ యష్‌నీ, ప్యాన్‌ రేంజ్‌ ఆర్టిస్ట్ ప్రభాస్‌నీ లింకప్‌ చేసి జరుగుతున్న ఆ వైరల్ డిస్కషన్‌ వాస్తవంలోకి వచ్చే వీలుందా అంటే కొందరు అవును అంటున్నారు. ఇంతకు అదేంటంటే.. విధికీ, ప్రేమకీ జరిగిన వింత యుద్ధంలో విధిని ఓడించి గెలిచిన విక్రమాదిత్యగా రాధేశ్యామ్‌లో అలరించారు ప్రభాస్‌. 2022 క్యాలెండర్ మొత్తం ఇదే ఇమేజ్‌ కంటిన్యూ అవుతుంది. 2023 సంక్రాంతికి మాత్రం డార్లింగ్‌ని ఆదిపురుష్‌గా చూస్తారు ఆడియన్స్. మర్యాదపురుషోత్తముడిగా బాక్సాఫీస్‌ దగ్గర ప్రోగ్రెస్‌ కార్డు తీసుకున్న తర్వాత సలార్‌(Salaar) సినిమా రిలీజ్‌ని లైన్‌లో పెడతారు డార్లింగ్‌. ఇదీ ప్రభాస్‌ కా కహానీ. మరి కేజీఎఫ్ హీరో యష్‌ కా జోష్‌ ఎలా ఉంది?.. చాప్టర్‌ టూ సూపర్‌ సక్సెస్‌ కావడంతో గట్టి హై మీద ఉన్నారు యష్‌. నార్త్‌లో హిందీ ఫస్ట్ డే కలెక్షన్లను క్రాస్‌ చేయడంతో మస్తు మజాను ఎంజాయ్‌ చేస్తున్నారు.

అటు ప్రభాస్‌, ఇటు యష్‌.. ఇద్దరూ ప్రశాంత్‌ నీల్‌ కెప్టెన్సీలో పనిచేసిన వారే. అందుకే వీరిద్దరినీ కలిపి ప్రశాంత్‌ ఓ మల్టీస్టారర్‌ చేస్తే చూడాలని ఉందంటున్నారు ఫ్యాన్స్. ఆ కథ కూడా కేజీయఫ్‌, సలార్‌ల మిక్సింగ్‌గా ఉండాలన్నది ఫ్యాన్స్ నుంచి అందుతున్న కోరిక. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ఫాలోయర్స్ తెచ్చుకున్న ఇద్దరు హీరోలు, కేజీయఫ్‌ ప్లస్‌ సలార్‌ కథల కొనసాగింపుగా సిద్ధమైన కథ.. ఊహించుకుంటేనే ఇంకో రేంజ్‌లో ఉంటుందన్నది డార్లింగ్‌ స్టార్‌, రాకింగ్‌ స్టార్‌ ఫ్యాన్స్ చెబుతున్న మాట. ఇది జరిగినా, జరక్కపోయినా ఈ ఊహ మాత్రం అదుర్స్ అంటూ సోషల్‌ మీడియా మోతెక్కిపోతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: ఇతను కళ్లతో మాయ చేస్తాడు.. మాటలతో బూరెలు వండేస్తాడు… ఎవరో గుర్తించారా..?

Soundarya Death Anniversary: చెక్కుచెదరని చిరునవ్వు.. చూడగానే ఆకట్టుకునే నిలువెత్తు రూపం.. నేడు సౌందర్య వర్థంతి

Acharya: మెగాస్టార్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు డేట్‌ ఫిక్స్‌.. ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారంటే!

Follow Us
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
శ్రీపెరుంబూదూర్ ప్రతిరూపం: 240 ఏళ్ల నాటి ‘అభినవ భూతపురి’ విశేషాలు
శ్రీపెరుంబూదూర్ ప్రతిరూపం: 240 ఏళ్ల నాటి ‘అభినవ భూతపురి’ విశేషాలు
వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే తోపు మ్యాచ్.. చివరి బంతి వరకు ఉత్కంఠే
వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే తోపు మ్యాచ్.. చివరి బంతి వరకు ఉత్కంఠే
అమెరికా కొత్త దాడులకు దిగితే తీవ్ర ప్రతిదాడి చేస్తాం..
అమెరికా కొత్త దాడులకు దిగితే తీవ్ర ప్రతిదాడి చేస్తాం..
అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!
అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!