Rocking star Yash: ప్రేక్షకుల అంచనాలకు ధీటుగా ‘KGF ఛాప్టర్ 2’ సినిమా ఉంటుంది: హీరో యశ్
బాహుబలి పాన్ ఇండియా సినిమా హవాను మొదలు పట్టగా దానికి కేజీఎఫ్ సినిమా కంటిన్యూ చేసింది. బాహుబలిని మించి కాకపోయినా ఆ రేంజ్ లో విడుదలైన అన్ని భాషల్లో అదరగొట్టింది కేజీఎఫ్.

KGF2 : పాన్ ఇండియా సినిమా ట్రెండ్ మొదలు పట్టగా.. దానికి కేజీఎఫ్ సినిమా కంటిన్యూ చేసింది. బాహుబలిని మించి కాకపోయినా ఆ రేంజ్ లో విడుదలైన అన్ని భాషల్లో అదరగొట్టింది కేజీఎఫ్. ఈ సినిమాతో ఒక్కసారిగా అన్ని భాషల్లో క్రేజ్ తెచ్చుకున్నాడు కన్నడ స్టార్ హీరో యశ్(Yash). ఇక ఈ సినిమానుంచి ఇప్పుడు సెకండ్ పార్ట్ రానుంది. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ, క్రేజీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. పాన్ ఇన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కేజీఎఫ్ పార్ట్ 1కు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా రోపొందింది. ఏప్రిల్ 14న తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. మార్చి 27న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కన్నడ ట్రైలర్‌ను శివ రాజ్ కుమార్ విడుదల చేయగా.. తెలుగు ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాకింగ్ స్టార్ యశ్ మాట్లాడుతూ ‘‘పునీత్ రాజ్ కుమార్ మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. మనకే కాదు.. యావత్ సినీ ఇండస్ట్రీకి పెద్ద లోటు అన్నారు. ఆయనతోనే హోంబలే ఫిలింస్ ప్రారంభమైంది. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. శివ రాజ్‌కుమార్‌గారు మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసినందుకు ఆయనకు థాంక్స్. ఇక ‘KGF ఛాప్టర్ 2’ గురించి మాట్లాడాలంటే ఈ సినిమాలో నా ప్రాముఖ్యత అత్యంత తక్కువనే చెప్పాలి. ఈ సినిమా కన్నడ సినీ ప్రేక్షకుల కల. ఇక్కడకు వచ్చిన ప్రతివాళ్లు గత సారి కంటే డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌తో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చారు. ఈ ప్రయాణం వెనుక విజయ్ కిరగందూర్ అనే వ్యక్తి అండగా నిలిచారు. ‘KGF’ గురించి ఆలోచించినప్పుడు, మాట్లాడినప్పుడు చాలా మంది మనల్ని పిచ్చోళ్లు అని అనుకుంటారు. మేం ఆశించిన దాని కంటే ఎక్కువగానే మాకు అందించారు ప్రేక్షకులు. పార్ట్ 1 సక్సెస్ తర్వాత చాలా మంది నాకు క్రెడిట్ అందించారు. కానీ అదంతా వట్టిదే. కానీ.. ఈ సినిమా క్రెడిట్ అంతా ప్రశాంత్ నీల్‌కే దక్కుతుంది. ఈ సినిమా తన కల. ఇలాంటి సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. సినిమాటోగ్రాఫర్ భువన గౌడ, రవి బస్రూర్ సంగీతం సహా పలువురు టెక్నీషియన్స్ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఇంత గొప్ప వర్కింగ్ టీమ్‌ను ఎక్కడా చూసుండనని గర్వంగా చెప్పగలను అంటూ చెప్పుకొచ్చారు యశ్.
మరిన్ని ఇక్కడ చదవండి :




