Kantara Collections: తెలుగులోనూ దుమ్ము రేపుతోన్న కాంతారా.. మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్‌ చేసిందంటే?

తెలుగులో ఈ సినిమాకు రూ.2 కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ తెలుగు థియేట్రికల్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీలోనూ కాంతార కలెక్షన్స్ అదిరిపోతున్నాయి.

Kantara Collections: తెలుగులోనూ దుమ్ము రేపుతోన్న కాంతారా.. మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్‌ చేసిందంటే?
Kantara Movie

Updated on: Oct 16, 2022 | 2:40 PM

కన్నడ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కాంతారా శనివారం (అక్టోబర్‌ 15న) తెలుగుతో పాటు మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజైంది. రిషబ్‌ షెట్టి హీరోగా నటించిన ఈ సినిమా కన్నడలో మాదరిగానే ఇక్కడ కూడా ఫస్ట్‌ షోనుంచే పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఫలితంగా మొదటి రోజే భారీ వసూళ్లను రాబట్టింది. ఒక్కరోజులోనే రూ.5 కోట్ల గ్రాస్ వసూళ్లని రాబట్టినట్లు ట్రేడ్‌ నిపుణులు పేర్కొన్నారు. కాగా తెలుగులో ఈ సినిమాకు రూ.2 కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ తెలుగు థియేట్రికల్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీలోనూ కాంతార కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. కాగా హిందీ వెర్షన్ శుక్రవారమే విడుదలైంది. నిజానికి నార్త్‌లో కాంతారకు పెద్దగా థియేటర్లు ఇవ్వలేదట. అయినా అనూహ్యంగా రూ.1.3 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. దీంతో థియేటర్ల సంఖ్యను పెంచారు. ఈనేపథ్యంలో రెండో రోజు ఏకంగా రూ.2.25 కోట్ల నెట్ వసూలు చేసింది. అంటే నార్త్‌లో రెండు రోజుల్లోనే సుమారు రూ.3.5 కోట్లు రాబట్టింది.

కాగా కర్ణాటకలోని కంబ్లా, భూతకోలా సాంప్రదాయం, అటవీ సంస్కృతిని నేపథ్యంగా తీసుకుని యాక్షన్‌ థ్రిల్లర్‌గా కాంతారాను తెరకెక్కించాడు హీరో రిషబ్‌ శెట్టి. దీనికి తోడు కేజీఎఫ్‌ సిరీస్‌ ఫేమ్‌ హోంబలే ప్రొడక్షన్స్‌ నిర్మాణ విలువలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా సప్తమి గౌడ నటించగా, కిశోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, నవీన్ డి పాడిల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. కన్నడ నాట సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.114 కోట్లు కలెక్ట్‌ చేసినట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. హీరో రిషబ్‌ వన్‌మ్యాన్‌ షోకు, ఊహించని క్లైమాక్స్‌ ఉండడంతో ప్రేక్షకులు సినిమాకు పోటెత్తుతున్నారు. ఈనేపథ్యంలోనే ఇతర భాషల్లోనూ రిలీజ్‌ చేశారు దర్శక నిర్మాతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..