KONDAA TRAILER: విపరీత పరిస్థితుల మధ్యలో పుట్టిన వాడే కొండా మురళి.. ఆకట్టుకుంటున్న ఆర్జీవీ ‘కొండా’ మూవీ ట్రైలర్
సంచలన దర్శకుడు వర్మ నుంచి సినిమా వస్తుందంటే తెలియకుండానే ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతుంది. నిత్యం వార్తల్లో నిలవడం రామ్‌గోపాల్ వర్మకు వెన్నతో పెట్టిన విద్య.
KONDAA : సంచలన దర్శకుడు వర్మ నుంచి సినిమా వస్తుందంటే తెలియకుండానే ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతుంది. నిత్యం వార్తల్లో నిలవడం రామ్‌గోపాల్ వర్మకు వెన్నతో పెట్టిన విద్య. ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేయడం వర్మకు మాత్రమే దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినిమాలను అత్యంత వేగంగా తీయడంలో కూడా వర్మకు ఎవరూ సాటిరారు. సినిమా ప్రకటించిన ఆరు నెలల్లోపే థియేటర్లకు తెస్తుంటాడు. ఆయన తీసే సినిమాల్లో నిజాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంటారు వర్మ. ఇప్పటికే పలు వివాదాస్పద బయోపిక్ లతో వార్తల్లో నిలిచిన వర్మ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కొండా మురళి జీవిత కథతో ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖపాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తైంది.
రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా కొండా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు ఆర్జీవీ. ఈ ట్రైలర్ లో మరోసారి తన వాయిస్ వినిపించారు ఆర్జీవీ. సమాజం గురించి నీతులు చెప్పుడు కాదు బాగుచేయాలి అంటూ వర్మ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. “నీకు పోయేటందుకు ఏమీ లేవు బానిస సంకెళ్లు తప్ప..విప్లవ పోరాటాలు చరిత్రను లాగే రైలింజన్..పేతందారుల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి..విపరీత పరిస్థితుల నుంచి విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని కాల్ మర్క్స్ 180 సంవత్సరాల క్రితం చెప్పాడు.అలాంటి విపరీత పరిస్థితుల మధ్యలో పుట్టిన వాడే కొండా మురళి” అంటూ ట్రైలర్ లో చెప్పుకొచ్చారు వర్మ. ఇక ట్రైలర్ ఆసక్తిగా కలిగిస్తుంది. ఇక ఈ ట్రైలర్ తో సినిమా పై అంచనాలు పెరిగాయి. కొండా ట్రైలర్ పై మీరూ ఓ లుక్కెయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :