Darshan: హీరో దర్శన్‌కు బెయిల్.. రేణుకా స్వామి తండ్రి రియాక్షన్ ఏంటంటే?

రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడైన నటుడు దర్శన్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న అతనికి చికిత్స చేయించుకునేందుకు గానూ ఆరు వారాల పాటు మంజూరు చేస్తున్నట్లు న్యాయ స్థానం తెలిపింది. అయితే ఈకేసులో దర్శన్‌కు బెయిల్ రావడంపై రేణుకాస్వామి తండ్రి కాశీనాథయ్య స్పందించారు

Darshan: హీరో దర్శన్‌కు బెయిల్.. రేణుకా స్వామి తండ్రి రియాక్షన్ ఏంటంటే?
Renuka Swamy Murder Case
Follow us

|

Updated on: Oct 30, 2024 | 1:41 PM

రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడైన హీరో దర్శన్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. నటుడికి అనారోగ్య సమస్యలున్నందన కర్ణాటక హైకోర్టు ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాలతో సహజంగానే దర్శన్ అనుకూల కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. అయితే మరోవైపు రేణుకా స్వామి కుటుంబం మాత్రం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దావణగెరెలోని హరిహరలో టీవీ9తో మాట్లాడారు రేణుకా స్వామి తండ్రి కాశీనాథయ్య. దర్శన్ బెయిల్ పై స్పందించిన ఆయన.. ‘ దర్శన్‌ కు మధ్యంతర బెయిల్ మంజూరైంది, దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఇది కోర్టు ఇచ్చిన ఆదేశం, దర్శన్ బెయిల్ న్యాయపరమైన చర్య. ఇది మాకు కొంత బాధ కలిగించినా న్యాయ ప్రక్రియను, కోర్టు ఆదేశాలను గౌరవిస్తాం. మాకు, మా కుటుంబానికి అన్యాయం జరుగుతోంది. దీనిపై న్యాయపోరాటం చేస్తాం, దోషులను శిక్షించే వరకు మా న్యాయ పోరాటం కొనసాగుతుంది’ అని రేణుకా స్వామి తండ్రి చెప్పుకొచ్చారు. ఇటీవలే రేణుకా స్వామి భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రేణుకా స్వామి హత్యకు గురైనప్పుడు భార్య గర్భంతో ఉంది.

దర్శన్, పవిత్ర గౌడ తదితరులు రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో దర్శన్ నంబర్ 2 నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో పవిత్ర గౌడ మొదటి ముద్దాయి. ప్రస్తుతం దర్శన్ ఆరోగ్య సమస్యను దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేశారు. వైద్య చికిత్స కోసం ఈ బెయిల్ ఇచ్చారు. దీని ప్రకారం దర్శన్ తనకు నచ్చిన ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

సంతోషంలో దర్శన్ అభిమానులు..

ఇక దర్శన్‌కు ఆరు వారాల షరతులతో కూడిన బెయిల్‌ లభించిందంటూ ఆయన భార్య విజయలక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. కామక్య ఆలయ ఫోటోను పోస్ట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. దేవి ఆశీస్సులతో తన భర్తకు బెయిల్ లభించిందని విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి