AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాళ్ళకే మీరు సాయం చేస్తారా ? నెటిజన్ ప్రశ్నకు రేణు దేశాయ్ స్ట్రాంగ్ కౌంటర్.. పొలిటిషియన్‏ను కాదంటూ ఫైర్..

Renu Desai: దేశంలో కరోనా సృష్టిస్తున్న విలయానికి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తమ ఆత్మీయులను కోల్పోతున్నారు. ఇప్పటికే ఈ మహమ్మారి

వాళ్ళకే మీరు సాయం చేస్తారా ? నెటిజన్ ప్రశ్నకు రేణు దేశాయ్ స్ట్రాంగ్ కౌంటర్.. పొలిటిషియన్‏ను కాదంటూ ఫైర్..
Renu Desai
Rajitha Chanti
|

Updated on: May 19, 2021 | 6:26 PM

Share

Renu Desai: దేశంలో కరోనా సృష్టిస్తున్న విలయానికి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తమ ఆత్మీయులను కోల్పోతున్నారు. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి వేలాది సంఖ్యలో ప్రాణాలను కోల్పోతుండగా.. ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్ అందక మరికొందరు కన్నుమూస్తున్నారు. కరోనాతో యావత్ భారతం అల్లాడిపోతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి కష్ట సమయంలో కోవిడ్ రోగుకు సహాయపడేందుకు పలువురు సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు. కొందరూ ఆర్థికంగా సాయం చేస్తుంటే మరికొందరు ఆసుపత్రులలో ఉండే రోగులకు సమస్యలను తీరుస్తున్నారు. అలాగే తమకు తెలిసిన ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న బెడ్స్, వెంటిలేటర్, ఐసీయూ బెడ్స్ ఇలా కావాల్సిన సమాచారాన్ని అందిస్తూ.. కొంత మంది ప్రాణాలను కాపాడెందుకు తాపత్రయ పడుతున్నారు. తమకు తెలిసిన చోట ఉన్న ఖాళీల గురించి చెబుతూ అవసరంలో ఉన్న వారికి చేతనైన సాయం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. టాలీవుడ్ నటి రేణు దేశాయ్ కూడా గత కొన్ని రోజులుగా కరోనా రోగులకు సాయం చేస్తున్నారు. అవసరమైన మందులు, బెడ్స్, ఆక్సిజన్, వైద్యం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరం ఉన్నవారు తనకు ఇన్‏స్టా‏గ్రామ్‏లో మెసేజ్ చేస్తే చేతనైన సాయం చేస్తా అని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రేణు దేశాయ్ ఇన్ స్టా అకౌంట్ కుప్పలు కుప్పలుగా మెసేజ్ లు వచ్చి చేరాయి. అందులో కరోనా రోగుల సాయం కోసం వచ్చిన మెసేజ్ లను చూడటానికి ఇబ్బంది అవుతుందని.. దయచేసి హాయ్, హాలో అంటూ మెసేజ్ లు చేయకండి అంటూ కాస్త ఘాటుగానే చెప్పారు రేణు దేశాయ్. తాజాగా మరోసారి ఓ నెటినజ్ చేసిన మెసేజ్‏పై ఘాటుగా స్పందించారు. మీరు ఉన్నవాళ్ళనే పట్టించుకుంటారా ? మిడిల్ క్లాస్ వాళ్ళను పట్టించుకోరా ? మాకు సాయం చేయరా ? కానీ మీరు సహాయం చేస్తాను అని చెప్పారు. ఎక్కడా మీ సహాయం అంటూ ప్రశ్నించాడు. ఇక ఆ మెసేజ్ చూసిన రేణు దేశాయ్.. సదరు నెటిజన్ మీద ఫైర్ అయ్యారు. దయచేసి అందరూ ఓ విషయాన్ని అర్థం చేసుకోండి. నాకు వీలైనంతలో గత పది పన్నెండు రోజులుగా సాయం చేస్తున్నాను. నేనేమి రాజకీయ నాయకురాలిని కాదు.. మీరు ప్రశ్నించడానికి ఓట్లు వేస్తే ఎన్నికైనా ప్రజా ప్రతినిధిని కాదు.. వెళ్ళి మీరు ఓటు వేసిన నాయకులను అడగండి.. వారిని ప్రశ్నించండి. మీరు ఇలాంటి సాయం చేయండి అంటూ డిమాండ్ చేస్తూ వేసే రూడ్ ప్రశ్నలకు నా స్పిరిట్ దెబ్బతింటుంది. మీ మెసేజీలను చూడకపోతే మరోసారి చేయండి… ఎందుకంటే నా ఇన్‍బాక్స్‏లో చాలా మెసేజ్ లు వస్తున్నాయి అని రేణు దేశాయ్ చెప్పారు.

Also Read: ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ విడుదల.. ఉగ్రవాది పాత్రలో ఆకట్టుకున్న సమంత .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

మధురమైన గాత్రం.. గమ్మత్తైన గమకాలతో పాటకు ప్రాణం పోస్తాడు.. మ్యూజిక్ లవర్స్‏కు మోస్ట్ వాంటెడ్ సింగర్‏గా సిధ్ శ్రీరామ్