సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసి ఆతర్వాత హీరోలు, హీరోయిన్స్ గా మారి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మరికొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లు సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యి వేరే కెరీర్ ను ఎంచుకున్నారు. కాగా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన వారి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటోలు కూడా ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకూ పై ఫొటోలో కనిపిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తుపట్టారా.? అల్ టైం బ్లాక్ బస్టర్ మూవీలో నటించింది ఆ నటి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆ చైల్డ్ ఆర్టిస్ట్ చాలా ఫేమస్. తన క్యూట్ నటనతో ప్రేక్షకుల మనసు దోచేసింది ఆమె. ఇంతకూ ఆమె ఎవరంటే..
పై ఫొటోలో ఉన్న నటిని గుర్తుపట్టడం కాస్త కష్టమే.. కానీ దీక్షణంగా చూస్తే ఆమెను కనిపెట్టొచ్చు. ఆమె మరెవరో కాదు.. లెజెండ్రీ నటుడు నందమూరి తారకరామారావు నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేష్ఠ. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో అలాగే బాలకృష్ణ, రజినీకాంత్ సినిమాల్లోనూ నటించింది. ముఖ్యంగా సమరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ చెల్లెలిగా నటించింది. కాగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్, మోహన్ బాబు కలిసి నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ మానవరాలిగా నటించింది శ్రేష్ఠ. అలాగే ఈ సినిమాలో మరో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచు మనోజ్ కూడా నటించాడు.
తాజాగా శ్రేష్ఠకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మంచు మనోజ్ ను పెళ్లి చేసుకోవాలన్న ప్రపోజల్ వచ్చిందని తెలిపింది. శ్రేష్ఠ మాట్లాడుతూ.. మోహన్ బాబుగారికి మనోజ్ కు నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని బాగా ఉండేది. అలాగే మా అమ్మగారు, మనోజ్ అమ్మగారు కజిన్స్ అవుతారు. వాళ్ళ ఊరు, మా ఊరు పక్కపక్కనే.. వాళ్లకు బాగా ఉండేది నాకు మనోజ్ కు పెళ్లి చేయాలనీ కానీ నేనే ఒద్దు అనుకున్నా.. నా రీజన్స్ నాకు ఉన్నాయి అని అని తెలిపింది శ్రేష్ఠ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.