Actress: వార్నీ.! ఈమె ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్.. ఇప్పుడు అందాలతో అరాచకమే..

పైన పేర్కొన్న ఫోటోలో కనిపిస్తోన్న ఈ హీరోయిన్‌ను మీరు ఈపాటికి కనిపెట్టే ఉంటారు. ఈమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఒకప్పుడు యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు.. అందరి సరసన నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ముఖ్యంగా ఈ హీరోయిన్‌ అందానికి..

Actress: వార్నీ.! ఈమె ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్.. ఇప్పుడు అందాలతో అరాచకమే..
Actress
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 24, 2024 | 5:51 PM

పైన పేర్కొన్న ఫోటోలో కనిపిస్తోన్న ఈ హీరోయిన్‌ను మీరు ఈపాటికి కనిపెట్టే ఉంటారు. ఈమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఒకప్పుడు యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు.. అందరి సరసన నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ముఖ్యంగా ఈ హీరోయిన్‌ అందానికి ఉండే ఫ్యాన్ బేస్ వేరని చెప్పొచ్చు. అల్లరోడితో ఈమె చేసిన రెండు సినిమాలు అప్పట్లో సూపర్ హిట్స్ అండీ బాబూ.. ఇంతకీ పై ఫోటోలోని హీరోయిన్ ఎవరో మీకు గుర్తొచ్చి ఉండొచ్చు.. ఆమె మరెవరో కాదు.. ‘కామ్నా జెఠ్మలానీ’.

తమిళ హీరో జయం రవికి సరసన ‘ఇదయ తిరుదాన్’ అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఆ తర్వాత గోపిచంద్ సరసన ‘రణం’ మూవీలో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఈ సినిమా తెలుగునాట అద్భుత విజయాన్ని అందుకోవడంతో.. కామ్నా జెఠ్మలానీకి వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఎక్కువగా గ్లామర్ పాత్రలకే పరిమితమైన ఈ భామ.. అటు కంటెంట్ ఉన్న సినిమాలను ఒప్పుకుంటూ.. తన కెరీర్‌ను ముందుకు కొనసాగించింది. ఈ క్రమంలోనే వరుస హిట్స్ అందుకుని.. ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే కొంతకాలం ఇండస్ట్రీని ఏలిన తర్వాత.. ఈమె ఆ తర్వాత పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో మెరిసింది.

అటు 2014లో బెంగుళూరుకు చెందిన బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకుని కామ్నా జెఠ్మలానీ పూర్తిగా సినిమాలకు దూరమయ్యింది. కాగా, ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇక లాక్‌డౌన్ తర్వాత మరోసారి సినీ ఇండస్ట్రీలోకి కంబ్యాక్ ఇచ్చింది ఈ అందాల భామ. 2022లో గరుడ అనే కన్నడ సినిమాలో.. అలాగే 2023లో వ్యవస్థ అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది. మరోవైపు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంది కామ్నా జెఠ్మలానీ. అందాలు ఆరబోస్తూ.. తన లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వయసు పెరుగుతున్నా.. అమ్మడి అందం తగ్గడం లేదని..చాలా బ్యూటీఫుల్‌గా ఉందని.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Kamna Jethmalani (@kamana10)

View this post on Instagram

A post shared by Kamna Jethmalani (@kamana10)

ఇది చదవండి: ఈ నాన్న కూచి ఎవరో గుర్తుపట్టారా.? కుర్రాళ్లను పిచ్చెక్కించే అందం, పైగా గ్లోబల్ స్టార్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్