Singer Swarnalatha: 22 ఏళ్ల వయసులో 10 వేలకు పైగా పాటలు పాడిన సింగర్.. 37 ఏళ్ల వయసులో అకాల మరణం..
దక్షిణాది నుంచి సినీ ప్రయాణం ప్రారంభించి ఉత్తరాదిలో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో సింగర్ స్వర్ణలత ఒకరు. సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు పెద్ద పేరు ఉంది.. అయినా.. అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో పాటలు పాడింది. స్వర్ణలత పేరు ఇప్పుడుచాలా మందికి తెలియకపోవచ్చు.. కానీ ఆమె పాడిన పాటలు మాత్రం ఇప్పుడు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి.

సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు బాలీవుడ్‌లో తమదైన ముద్ర వేశారు. తమ ప్రతిభతో దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రేమను గెలుచుకున్నాడు. భారతీయ సినీ పరిశ్రమలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. దక్షిణాది నుంచి సినీ ప్రయాణం ప్రారంభించి ఉత్తరాదిలో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో సింగర్ స్వర్ణలత ఒకరు. సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు పెద్ద పేరు ఉంది.. అయినా.. అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో పాటలు పాడింది. స్వర్ణలత పేరు ఇప్పుడుచాలా మందికి తెలియకపోవచ్చు.. కానీ ఆమె పాడిన పాటలు మాత్రం ఇప్పుడు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి. కేవలం 22 ఏళ్ల వయసులోనే పదివేలకు పైగా పాటలు పాడింది. కానీ చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచివెళ్లింది.
స్వర్ణలత ఏప్రిల్ 1973లో కేరళలో జన్మించారు. సంగీతం ప్రపంచంలో తన గాత్రంలో మాయ చేసింది. మధుమరైన గానంతో ది క్వీన్ ఆఫ్ టోన్స్ అని పేరు సంపాదించుకుంది. 15 ఏళ్ల వయసులోనే గాయనిగా కెరీర్ ప్రారంభించింది. జీవితాంతం వరకు సంగీతంతోనే అనుబంధం కలిగి ఉంది. 22 ఏళ్ల వయసులో దాదాపు 10,000 పైగా పాటలు పాడింది. ఆమె పాటలన్నీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్. బాలీవుడ్‌లో చాలా తక్కువ పాటలు పాడింది. కానీ ఎంతో మంది సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకుంది. ఆమె పాడిన పాటలలో హమ్మా హమ్మా, ముకాబ్లా ముకాబ్లా, హయే రామా, సుంతా హై మేరా ఖుదా, షబ్బా షబ్బా, తేరే లిప్పన్ కీ హన్సీతో సహా బాలీవుడ్‌లో అనేక పాటలు పాడారు. ఆమె పాడిన పాటలకు ఇప్పటికీ రెస్పాన్స్ ఎక్కువగా వస్తుంది.
సినీ సంగీత ప్రపంచంలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆమె.. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచివెళ్లింది. తన అద్భుతమైన గాత్రంతో ప్రశంసలు అందుకుంది. కానీ ఇడియోపతిక్ ఊపిరిత్తుల వ్యాధి కారణంగా 2010 సెప్టెంబర్ 12న మరణించింది. అప్పటికీ ఆమె వయసు 37 సంవత్సరాలు మాత్రమే. 1994లో కరుతమ్మ చిత్రంలోని పోరెల్ పొన్నుతై పాటకు జాతీయ అవార్డు కూడా అందుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




