Regina Cassandra: లేడీ ఓరియెంటెడ్ మూవీతో రానున్న రెజీనా.. ఆకట్టుకుంటున్న ‘నేనేనా’ ట్రైలర్..

యంగ్ బ్యూటీ రెజీనా ఈ మధ్య ఎక్కువగా సినిమాల్లో కనబడటం లేదు అనేది ఫిలిం సర్కిల్స్‌లో బాగా వినిపిస్తున్న వార్త. రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన రెజీనా కాసాండ్రా .

Regina Cassandra: లేడీ ఓరియెంటెడ్ మూవీతో రానున్న రెజీనా.. ఆకట్టుకుంటున్న 'నేనేనా' ట్రైలర్..
Regina Cassandra
Follow us

|

Updated on: Sep 15, 2021 | 7:05 AM

Regina Cassandra: యంగ్ బ్యూటీ రెజీనా ఈ మధ్య ఎక్కువగా సినిమాల్లో కనబడటం లేదు అనేది ఫిలిం సర్కిల్స్‌లో బాగా వినిపిస్తున్న వార్త. రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన రెజీనా కాసాండ్రా .. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించింది. ఆ తర్వాత ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గాయి.. దాంతో తమిళ్ ఇండస్ట్రీతోపాటు.. బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినా అనుకున్నంత సక్సెస్ కాలేక పోయింది. అందం-అభినయం ఉన్న ఈ భామకు సడన్‌గా ఆఫర్లు తగ్గిపోవడంతో అమ్మడి అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఇక ఇప్పుడు ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. కార్తీక్ రాజు దర్శకత్వం ఓ హరర్ సినిమా చేస్తుంది రెజీనా. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఒక మర్డర్ కేసు విచారణ చేస్తుండగా ..  అది దాదాపు 100 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనతో మళ్లీ ఇప్పుడు జరుగుతుందని ఆ విచారణలో తెలుస్తుంది. పురావస్తుశాఖలో పనిచేస్తున్న హీరోయిన్ ఈ కేసును ఛేదించడానికి పోలీసులకు సాయం చేస్తుంది. అయితే 100 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన ఏంటి..? మళ్లీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది.? అనేది సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.  ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మిస్టరీ థ్రిల్లర్‌ను తమిళంలో ‘సూర్పనగై’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రెజీనా మరో హిట్ అందుకుంటుందేమో ఖాయంగా కనిపిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో గుంటనక్క ఎవరో సన్నీకి క్లారిటీ ఇచ్చిన నటరాజ్ మాస్టర్..!

Mahesh Babu: సమాజంలో పడిపోతున్న విలువలకు ఇది తార్కాణం.. సైదాబాద్‌ చిన్నారి ఘటనపై స్పందించిన మహేష్‌ బాబు..

Mahesh Babu: ఘట్టమనేని వారింట చవితి వేడుకలు ఎంత సంబురంగా జరిగాయో చూశారా.. వీడియో షేర్‌ చేసిన నమ్రతా.