Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: సమాజంలో పడిపోతున్న విలువలకు ఇది తార్కాణం.. సైదాబాద్‌ చిన్నారి ఘటనపై స్పందించిన మహేష్‌ బాబు..

Mahesh Babu: హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి అత్యంత పాశవికంగా దాడి చేసి చంపిన సంఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అభంశుభం తెలియని..

Mahesh Babu: సమాజంలో పడిపోతున్న విలువలకు ఇది తార్కాణం.. సైదాబాద్‌ చిన్నారి ఘటనపై స్పందించిన మహేష్‌ బాబు..
Follow us
Narender Vaitla

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 15, 2021 | 12:04 AM

Mahesh Babu: హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా దాడి చేసి చంపిన సంఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అభంశుభం తెలియని చిన్నారిని చిదిమేసిన పల్లంకొండ రాజు అనే వ్యక్తిపై సమాజం కోపంతో ఉంది. పోలీసులు, సమాజం కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఆ మానవ మృగం కోసం పెద్ద ఎత్తున సర్చింగ్‌ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే రాజును పట్టించిన వారికి రూ. 10 లక్షల రివార్డ్‌ ప్రకటిస్తామని పోలీసులు ప్రకటించారు. ఇదిలా ఉంటే అత్యంత దారుణమైన ఈ సంఘటనపై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఇటీవల హీరో మంచు మనోజ్‌ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన విషయం తెలిసిందే.

సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై హీరో మహేశ్‌ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. భావోద్వేగానికి గురైన మహేష్‌ సమాజంలో పడిపోతున్న విలువలను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఈ దారుణం సొసైటీగా మనం ఎంత కిందకి పడిపోయామో గుర్తు చేస్తుంది. అసలు మన కుమార్తెలు సురక్షితమేనా అన్నది ఎప్పటికీ  ప్రశ్నగానే మిగిలిపోతుంది. చిన్నారి కుటుంబం ఇప్పుడు ఎంతటి  దుఖంలో మునిగిపోయిందో ఊహించలేం’ అంటూ మహేశ్‌ ఎంతో ఎమోషనల్‌ అయ్యారు.

మహేష్ చేసి ట్వీట్..

Also Read: Labour Shramik Card: లేబర్‌ కార్డు గురించి మీకు తెలుసా..! ఎలా అప్లై చేయాలి.. ఏ వివరాలు నమోదు చేయాలి 

Viral Video: బుద్ధిగా హోం వర్క్‌ చేసుకుంటున్న చిన్నారిని తప్పుపడుతున్న నెటిజన్లు.. ఎందుకో తెలిస్తే మీరు కూడా.!

Gujarat Floods: గుజరాత్‌ ఉక్కిరి బిక్కిరి.. జామ్‌నగర్‌, రాజ్‌కోట్‌లో ఎడతెరిపి లేని వర్షాలు.. వరదలతో అపారనష్టం