Labour Shramik Card: లేబర్ కార్డు గురించి మీకు తెలుసా..! ఎలా అప్లై చేయాలి.. ఏ వివరాలు నమోదు చేయాలి
Labour Shramik Card: దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో(Unorganised Sector) కార్మికుల సమస్యలు చాలా ఎక్కువ. ఇటువంటి కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర కార్మిక,
Labour Shramik Card: దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో(Unorganised Sector) కార్మికుల సమస్యలు చాలా ఎక్కువ. ఇటువంటి కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ ఈ శ్రమ్ పోర్టల్(E Shram Portal) ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా అసంఘటిత కార్మికుల వివరాలన్నీ ఒకేచోట లభిస్తాయి. తద్వారా ఆ కార్మికుల సంక్షేమం కోసం వివిధ సామాజిక భద్రతా పథకాల్ని మరింత మెరుగ్గా అమలు చేయడానికి వీలవుతుంది. ఆధార్ కార్డు(Aadhaar Card) ద్వారా అసంఘటిత కార్మికులు తమ వివరాల్ని పోర్టల్‌లో నమోదు చేసుకోవల్సి ఉంటుంది.
లేబర్ శ్రామిక్ కార్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ
1. ఈ శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయడానికి eshram.gov.in లో అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి. 2. హోమ్ పేజీలోని ‘ఈ శ్రమ్‌లో నమోదు చేసుకోండి’ అనే లింక్‌పై క్లిక్ చేయండి. 3. ఆధార్‌తో లింకప్ అయి ఉన్న మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి OTP పై క్లిక్ చేయండి. 4. నమోదు ప్రక్రియను పూర్తి చేయడానికి తదుపరి సూచనలను అనుసరించండి. 5. కార్మికుడికి ఆధార్-లింక్ చేయబడిన మొబైల్ నంబర్ లేకపోతే అతడు/ ఆమె సమీప CSCని సందర్శించి, బయోమెట్రిక్ ప్రామాణీకరణ ద్వారా నమోదు చేసుకోవచ్చు. 6. కార్మికులు ఈ శ్రమ్‌లో నమోదు చేసుకోవడానికి ఆధార్ నంబర్, ఆధార్-లింక్ చేయబడిన మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ కలిగి ఉండాలి.
రిజిస్ట్రేషన్ తరువాత కార్మికులకు ప్రత్యేకమైన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) తో కూడిన ఈ శ్రమ్ కార్డు జారీ చేస్తారు. ఈ కార్డు ద్వారా ఎప్పుడైనా ఎక్కడైనా వివిధ సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలను పొందవచ్చు. సంక్షోభ సమయాల్లో కార్మికులు అనేక ప్రయోజనకరమైన పథకాల ప్రయోజనాన్ని కూడా అర్హులవుతారు. 16-59 మధ్య వయస్సు కలిగిన ఏ కార్మికుడు అయినా ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ పథకం వల్ల రూ.2 లక్షల ఉచిత ప్రమాద బీమా కూడా లభిస్తుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు కుటుంబ సభ్యులకు వస్తాయి. ఒకవేళ ప్రమాదంలో అంగవైకల్యం సంభవిస్తే రూ.లక్ష అందిస్తారు. దీని కోసం మీరు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.