Viral Video: బుద్ధిగా హోం వర్క్‌ చేసుకుంటున్న చిన్నారిని తప్పుపడుతున్న నెటిజన్లు.. ఎందుకో తెలిస్తే మీరు కూడా.!

Viral Video: స్కూల్‌కి వెళ్లే ఓ చిన్నారి క్రమంతప్పకుండా హోం వర్క్‌ చేసుకుంటూ బుద్ధిగా చదువుకుంటే ఎవరైనా శభాష్‌ అని చెబుతారు. కానీ ఓ కుర్రాడు అదే పని చేస్తే...

Viral Video: బుద్ధిగా హోం వర్క్‌ చేసుకుంటున్న చిన్నారిని తప్పుపడుతున్న నెటిజన్లు.. ఎందుకో తెలిస్తే మీరు కూడా.!
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 14, 2021 | 8:54 PM

Viral Video: స్కూల్‌కి వెళ్లే ఓ చిన్నారి క్రమంతప్పకుండా హోం వర్క్‌ చేసుకుంటూ బుద్ధిగా చదువుకుంటే ఎవరైనా శభాష్‌ అని చెబుతారు. కానీ ఓ కుర్రాడు అదే పని చేస్తే మాత్రం అందరూ తప్పుపడుతున్నారు. అసలు విషయం తెలిస్తే మీరు కూడా ఆ చిన్నారిది తప్పని అంటారు. అదేంటి బుద్ధిగా హోం వర్క్‌ చేసుకుంటే ఎందుకు తిడుతున్నారనేగా మీ సందేహం అయితే మీరు ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

తాజాగా సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను స్కూటీపై ఎక్కించుకొని వెళుతోంది. అయితే వెనకాల కూర్చున్న బుడ్డొడు సీటు చివరగా కూర్చొని మధ్యలో నోట్‌ పుస్తకం పెట్టుకొని హోం వర్క్‌ చేస్తున్నాడు. ఈ సమయంలో తల్లి వేగంగా స్కూటీని నడిపిస్తోంది. అటుగా వెళుతోన్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చూడడానికి ఫన్నీగా ఉన్నా ఏ మాత్రం పట్టుతప్పినా చిన్నారి ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

నెటిజన్లు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. చిన్నారిని తెలిసి మరీ ప్రమాదంలో నెడుతోన్న తల్లిని కూడా తప్పుపడుతున్నారు. ఏ పని ఎక్కడ చేయాలో అక్కడ చేస్తేనే మంచి పేరు వస్తుంది. అలా కాకుండా మంచి పనిని కూడా చేయాల్సిన చోట చేయకపోతే తప్పుపట్టే పరిస్థితులు వస్తాయి. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Wife Burns Man: ప్రియుడి మోజులో పడి భర్తకు నిప్పు.. తప్పించుకునేందుకు యత్నించిన వ్యక్తిపై బండరాయితో దాడి..! 

Viral Video: అమ్మ బాబోయ్‌.. ఇదేం క్రియేటివిటీరా బాబు. బైక్‌ను కారుగా మార్చిన తీరు చూస్తే..

Viral Video: కోనసీమ జాలర్ల వలకు చిక్కిన అరుదైన చేప.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే