Ghaati: అనుష్క ఊచకోత.. ప్రభాస్ వదిలిన అనుష్క ‘ఘాటి’ రిలీజ్ గ్లింప్స్
క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

అందాల భామ అనుష్క ప్రస్తుతం ఆచితూచి అడుగులేస్తోంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న అనుష్క.. ఆతర్వాత సినిమాల స్పీడ్ తగ్గించింది. అనుష్క బాహుబలి తర్వాత భాగమతి, నిశ్శబ్దం, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలు చేసింది. ఈ మూడు సినిమాల్లో నిశ్శబ్దం సినిమా డిజాస్టర్ అయ్యింది. మిగిలిన రెండు సినిమాలు మంచి విజయాలను అందుకుంది. ఇక ఇప్పుడు ఘాటి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది ఒకటి. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. విక్రమ్ ప్రభు, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ప్రతిరోజు నాకు ఫిజికల్ టచ్ కావాలి.. లేకుంటే నిద్రపట్టదు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ ఇప్పుడు సెప్టెంబర్ 5న విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. సినిమా విడుదల దగ్గరపడటంతో తాజాగా రిలీజ్ టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమా టీజర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు.
ఇన్నాళ్లు ఏమైపోయిందో ఈ భామ..! బిగ్ బాస్ రతికా గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే
ఈ టీజర్ సినిమా పై అంచనాలు క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా చాలా కాలం తర్వాత అనుష్క గూస్ బంప్స్ యాక్టింగ్ తో మరోసారి ఇరగదీసింది. ఈ సినిమాలో కంటెంట్.. అందుకు తగిన ఎమోషన్స్, యాక్షన్ ఇలా అన్ని అంశాలను కలగలిపి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్‌లో అనుష్క ఊచకోత చూపించింది. మాస్ యాక్టింగ్ తో అదరగొట్టింది అనుష్క. మరి ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
అయ్యో.. ఎంతకష్టమొచ్చింది..! రూ. 60 కోట్లకు మోసం.. రెస్టారెంట్ మూసేసిన స్టార్ హీరోయిన్..
The QUEEN at her FIERCEST BEST ❤️🔥on the Big Screens tomorrow #GhaatiReleaseGlimpse OUT NOW ▶️Watch Here: https://t.co/vINvrhuiQa
VICTIM. CRIMINAL. LEGEND Witness her journey 🔥
🎟️Book Now tickets now:https://t.co/7YRlKANrO8 |https://t.co/WsTVa24Ccn#GHAATI GRAND RELEASE… pic.twitter.com/4EdmG12n5J
— UV Creations (@UV_Creations) September 4, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








