భార్యాపిల్ల‌ల కోసం కంసాలిగా మారిన సంపూ…

కరోనా కట్టడి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో యావ‌త్ దేశంలో ఇళ్ల‌కే ప‌రిమిత‌మైంది. ఈ క్ర‌మంలో ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉంటే ఫిల్మ్ సెల‌బ్రిటీస్ ఇళ్లకే పరిమితమైన..సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో ట‌చ్ లో ఉంటున్నారు. కొంద‌రు వెరైటీ ఛాలెంజ్స్ తో వార్త‌ల్లో నిలుస్తున్నారు. తాజాగా బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు ఈ లాక్‌డౌన్‌ సమయంలో తన పాత‌ వృత్తిపై మ‌రోసారి ఫోక‌స్ పెట్టారు ఇంట్లో మిగిలి పోయిన గజ్జెలతో తన భార్య, పిల్లల కోసం.. […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:03 pm, Fri, 24 April 20
భార్యాపిల్ల‌ల కోసం కంసాలిగా మారిన సంపూ...

కరోనా కట్టడి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో యావ‌త్ దేశంలో ఇళ్ల‌కే ప‌రిమిత‌మైంది. ఈ క్ర‌మంలో ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉంటే ఫిల్మ్ సెల‌బ్రిటీస్ ఇళ్లకే పరిమితమైన..సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో ట‌చ్ లో ఉంటున్నారు. కొంద‌రు వెరైటీ ఛాలెంజ్స్ తో వార్త‌ల్లో నిలుస్తున్నారు. తాజాగా బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు ఈ లాక్‌డౌన్‌ సమయంలో తన పాత‌ వృత్తిపై మ‌రోసారి ఫోక‌స్ పెట్టారు ఇంట్లో మిగిలి పోయిన గజ్జెలతో తన భార్య, పిల్లల కోసం.. మెట్టెలు, గజ్జెలు సొంతగా త‌యారుచేశారు. త‌న మార్క్ స్టైల్లో ‘బి ది రియల్‌ మ్యాన్’‌ చాలెంజ్‌ను పూర్తి చేశాడు బ‌ర్నింగ్ స్టార్.

అందుకు సంబంధించిన వీడియోను సంపూర్ణేష్‌ బాబు ట్విటర్ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘రాజు పేద తేడా లేదు. నీ ఆస్తి, డబ్బు.. నీ వెనక రావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోవద్దు, గుర్తుచేసుకుంటున్న సమయం ఇది. మా ఆవిడ కోసం, పిల్లల కోసం నా పాత “కంశాలి”వృత్తి ని గుర్తు చేసుకుంటూ.. ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేయించి ఇచ్చాను’ అని సంపూర్ణేష్ రాసుకొచ్చాడు.