AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja: శరవేగంగా రావణాసుర మూవీ షూటింగ్.. ఫస్టు డే ఎగ్జైట్మెంట్ అంటూ మాస్ రాజా సెల్ఫీ..

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి దూసుకుపోతున్నారు. త్వరలోనే ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రవితేజ.

Ravi Teja: శరవేగంగా రావణాసుర మూవీ షూటింగ్.. ఫస్టు డే ఎగ్జైట్మెంట్ అంటూ మాస్ రాజా సెల్ఫీ..
Ravanasura
Rajeev Rayala
| Edited By: |

Updated on: Feb 03, 2022 | 7:33 AM

Share

Ravi Teja: మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి దూసుకుపోతున్నారు. త్వరలోనే ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రవితేజ. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈసినిమా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. గత ఏడాది వచ్చిన క్రాక్ సినిమా రవి తేజకు సాలిడ్ ,హిట్ అందించింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా అలరించనున్నారు. అలాగే ఈ సినిమా తర్వాత రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా దివ్యాన్ష కౌశిక్ అలరించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికకారిగా కనిపించనున్నాడు. ఈ సినిమాతోపాటు త్రినాద్ రావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నాడు. అలాగే టైగర్ నాగేశ్వర్ రావు అనే సినిమాను కూడా పట్టాలెక్కించనున్నాడు.

అలాగే రవితేజ హీరోగా ‘రావణాసుర’ అనే సినిమా కూడా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, రవితేజ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్రలో నటించనున్నాడు. ప్రస్తుతం సుశాంత్ పాల్గొనే సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో రవితేజ జాయిన్ అయ్యారు. ఈ రోజున ఫస్టు డే ఎగ్జైట్మెంట్ అంటూ రవితేజ ఒక ఫొటో షేర్ చేశాడు. ఈ సినిమాలో ఐదుగురు కథానాయికలు కనువిందు చేయనున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ .. మేఘ ఆకాశ్ .. ఫరియా అబ్దుల్లా .. దక్ష నగార్కర్ .. పూజిత పొన్నాడ ఆ జాబితాలో ఉన్నారు.

Ravi Teja

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijaya Shanthi: చిన్నమ్మతో రాములమ్మ భేటీ.. తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

Childhood Rare Pic: ఆడపిల్ల వేషంలో దక్షిణాది సీనియర్ నటుడు.. తెలుగువారికి సుపరిచితులు ఎవరో గుర్తు పట్టారా. ..

Priyamani: గ్రాండ్ గా సెకండ్ ఇన్నింగ్ షురూ చేసిన ‘ప్రియమణి’.. చీరలో ఆకట్టుకుంటున్న ఫొటోస్…

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి