AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: ఫ్యామిలీ స్టార్ సినిమాపై రష్మిక ఇంట్రెస్టింగ్ ట్వీట్.. విజయ్ రియాక్షన్ వైరల్..

రెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో మరోసారి ఫ్యామిలీ మ్యాన్‏గా తనదైన నటనతో అలరించేందుకు రెడీ అయ్యాడు విజయ్ దేవరకొండ. అలాగే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా దూసుకుపోతున్న మృణాల్.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతుండడంతో ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. మరోవైపు ఫ్యామిలీ స్టార్ మూవీ టీంకు సినీ సెలబ్రెటీస్, అభిమానులు అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Rashmika Mandanna: ఫ్యామిలీ స్టార్ సినిమాపై రష్మిక ఇంట్రెస్టింగ్ ట్వీట్.. విజయ్ రియాక్షన్ వైరల్..
Rashmika Mandanna, Vijay
Rajitha Chanti
|

Updated on: Mar 29, 2024 | 10:44 AM

Share

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ఇప్పుడు ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సైతం మెస్మరైజ్ చేశాయి. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో మరోసారి ఫ్యామిలీ మ్యాన్‏గా తనదైన నటనతో అలరించేందుకు రెడీ అయ్యాడు విజయ్ దేవరకొండ. అలాగే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా దూసుకుపోతున్న మృణాల్.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతుండడంతో ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. మరోవైపు ఫ్యామిలీ స్టార్ మూవీ టీంకు సినీ సెలబ్రెటీస్, అభిమానులు అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఈ క్రమంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు తెలిపింది. ఆల్ ది బెస్ట్ డార్లింగ్స్’ అంటూ విష్ చేసింది.

” నా డార్లింగ్స్ విజయ్ దేవరకొండ, పరశురామ్ పెట్ల (దర్శకుడు)లకు శుభాకాంక్షలు. ఏప్రిల్ 5న సినిమా విడుదల కానుంది. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అందుకే నాకు పార్టీ కావాలి. మై లవ్ మృణాల్‌ ఆల్ ది ” అంటూ రాసుకొచ్చింది. రష్మిక ట్వీట్ కు విజయ్ దేవరకొండ క్యూటెస్ట్ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. గతంలో పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటించిన చిత్రం గీతా గోవిందం. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ మూవీ సమయం నుంచే విజయ్, రష్మిక మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అలాగే చాలాసార్లు వీరిద్దరు ఒకరి సినిమాకు మరొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక ఇటీవల విడుదలైన ‘ఫ్యామిలీ స్టార్’ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ చివరిగా ‘ఖుషి’ సినిమాలో నటించాడు. ఇందులో సమంతతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోగా.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us