Rashmika Mandanna: క్రేజీ ఛాన్స్ కొట్టేసిన రష్మిక.. ఆ స్టార్ హీరో సరసన నేషనల్ క్రష్..
కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది రష్మిక. ఆ తర్వాత ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత రష్మికకు తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. తమిళంలో కార్తీ 'సుల్తాన్', దళపతి విజయ్ 'వారిసు' సినిమాల్లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు 'డి51'తో మరో తమిళ సినిమాను ఖాతాలో వేసుకుంది.

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రంతో కన్నడ బ్యూటీ రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తెలుగుతోపాటు.. హిందీ, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న రష్మిక.. ఇప్పుడు మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కొత్త ప్రాజెక్టులో కథానాయికగా ఎంపికైంది నేషనల్ క్రష్. ధనుష్ 51వ సినిమా పేరు ‘డి 51’ . ఈ సినిమాలో కథానాయికగా రష్మిక ఎంపికైనట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు మేకర్స్. దీంతో నేషనల క్రష్ కు కంగ్రాట్స్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. ‘డి51’ సినిమాలో ధనుష్ డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నాడు .
కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది రష్మిక. ఆ తర్వాత ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత రష్మికకు తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. తమిళంలో కార్తీ ‘సుల్తాన్’, దళపతి విజయ్ ‘వారిసు’ సినిమాల్లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు ‘డి51’తో మరో తమిళ సినిమాను ఖాతాలో వేసుకుంది.




రష్మిక మందన్న ఇన్ స్టా పోస్ట్…
View this post on Instagram
ధనుష్ ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత తన 50వ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత ‘డి51’ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించనున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్, ఒమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై నిర్మించనున్న ఈ మూవీలో ధనుష్, రష్మిక మందన్న జంటగా కనిపించనున్నారు. ఇక మిగతా నటీనటులు, సాంకేతిక వర్గం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రష్మిక మందన్న ఇన్ స్టా పోస్ట్…
View this post on Instagram
మరోవైపు రష్మిక బాలీవుడ్‌లో కూడా బిజీగా ఉంది. రణబీర్ కపూర్ తో ఈ బ్యూటీ నటించిన ‘యానిమల్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రివ్యూ వీడియో అందరినీ ఆకట్టుకుంది. డిసెంబర్ 1న సినిమా విడుదల కానుంది. ‘యానిమల్’ ఓపెనింగ్ తర్వాత బాలీవుడ్‌లో రష్మిక ఫాలోయింగ్ మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది.
ధనుష్ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
ధనుష్ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




