Samantha: ఖుషీ మ్యూజికల్ కాన్సర్ట్‌కు రానున్న సమంత.. మరీ ప్రమోషన్స్ ?..
సమంత ప్రస్తుతం హాలీడేలో ఉన్నారు. ఈమె కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని ఫిక్సైపోయారు. తన ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు స్యామ్. మయోసైటిస్ కారణంగా అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకోవాలని చూస్తున్నారు సమంత. అందుకే ఒప్పుకున్న ఖుషీ, సిటాడెల్‌లను పూర్తి చేసారు సమంత. వాటి ప్రమోషన్స్‌కు వస్తారా రారా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.

లీవ్‌లో ఉన్నపుడు వచ్చి పని చేయమంటే ఎంత చిరాగ్గా ఉంటుంది చెప్పండి..? ఏంటి ఉంటుంది కదా.. మరి అలాంటి లీవ్‌లోనే ఇప్పుడు సమంత కూడా ఉన్నారు. ఒకటి రెండు కాదు.. తనకు తనే ఏడాది సెలవు ప్రకటించేసుకున్నారు ఈ బ్యూటీ. మరి ఇప్పుడు కొత్త సినిమాల ప్రమోషన్‌కు వస్తారా.. విడుదలకు సిద్ధంగా ఉన్న ఖుషీకి స్యామ్ సపోర్ట్ ఉంటుందా లేదా..? ఈ చిత్ర ప్రమోషన్‌లో సమంత పాత్ర ఎంత..? సమంత ప్రస్తుతం హాలీడేలో ఉన్నారు. ఈమె కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని ఫిక్సైపోయారు. తన ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు స్యామ్.
మయోసైటిస్ కారణంగా అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకోవాలని చూస్తున్నారు సమంత. అందుకే ఒప్పుకున్న ఖుషీ, సిటాడెల్‌లను పూర్తి చేసారు సమంత. వాటి ప్రమోషన్స్‌కు వస్తారా రారా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.




సమంత ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
సిటాడెల్ అంటే వెబ్ సిరీస్.. పైగా దాని రిలీజ్‌కు ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ ఖుషీ మాత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. దీని ప్రమోషన్స్ కోసం సమంత స్పెషల్ ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఓ కామన్ ఇంటర్వ్యూతో పాటు.. మ్యూజికల్ ఈవెంట్‌కు మాత్రమే వస్తానని మేకర్స్‌కు ముందుగానే చెప్పినట్లు తెలుస్తుంది.
సమంత ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
ఆగస్ట్ 15న ఖుషీ మ్యూజికల్ కాన్సర్ట్ జరగనుంది. దీనికి స్యామ్ వస్తుందని విజయ్ కూడా కన్ఫర్మ్ చేసారు. అలాగే ఓ ఇంటర్వ్యూకు రానున్నారు స్యామ్. ఇది మినహాయిస్తే.. ఖుషీకి ఈమె వైపు నుంచి నో ప్రమోషన్స్ ఇంక. గతంలో యశోద, శాకుంతలం సినిమాలకు కూడా అరకొర ప్రమోషన్స్ చేసారు ఈ బ్యూటీ. ఖుషీకి ఇదే అప్లై చేస్తున్నారీమె. మొత్తానికి మరో ఏడాది వరకు సమంత సినిమా ఈవెంట్స్‌కు బాగానే డిస్టేన్స్ మెయింటేన్ చేయబోతున్నారు.
విజయ్ దేవరకొండ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
విజయ్ దేవరకొండ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




