AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi : మెగా కవిత.. సతీమణి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చిరు ప్రేమతో

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో చిరంజీవి తన వింటేజ్ లుక్ తో ఆకట్టుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

Chiranjeevi : మెగా కవిత.. సతీమణి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చిరు ప్రేమతో
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Feb 18, 2026 | 7:56 PM

Share

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన స్టార్‌డమ్‌కు మించి, తనలోని భావోద్వేగాన్ని, కృతజ్ఞతను చూపించారు. తన భార్య సురేఖకు పుట్టినరోజు సందర్భంగా ఆయన రాసిన హృద్యమైన సందేశం నిజాయితీతో, ఆప్యాయతతో అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది.

 నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖ కు జన్మదిన శుభాకాంక్షలు 

1980 ఫిబ్రవరి 20న మనం వివాహం చేసుకున్న నాటినుంచి నువ్వే నా బలంగా మారావు. ఈరోజు నీ పుట్టినరోజును, ముందుగానే మన వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ వేళ నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. నువ్వే మన కుటుంబానికి కేంద్రబిందువు. అందరినీ ప్రేమతో కట్టిపడిపే శక్తి. నా కుటుంబ సభ్యులను నీ వారిలా చూసుకుని, ప్రతి సందర్భంలో వారికి అండగా నిలబడి, నా తల్లిదండ్రులకు నిజమైన కూతురిలా మారావు. వారు కూడా నిన్ను అంతే ప్రేమతో దగ్గర చేసుకున్నారు.

నా విజయానికి రహస్యం ఏమిటి అని ఎవరైనా అడిగితే… అది నా ప్రతిభ, కృషి కాదు — “అది నువ్వే”. ఎందుకంటే నువ్వు ప్రతి బాధ్యతను తీసుకున్నావు కాబట్టి నేను నా వృత్తిపై పూర్తిగా దృష్టి పెట్టగలిగాను.

ప్రతి కష్టంలోనూ, ప్రతి ఆనంద వేడుకలోనూ మనందరినీ ఒకటిగా నిలబెట్టేది నువ్వే. నువ్వు కేవలం నా భార్య మాత్రమే కాదు… నా బలం, నా అండ, నా ప్రశాంతత.

ఈరోజు నీ పుట్టినరోజు సందర్భంగా, అలాగే మన వివాహ వార్షికోత్సవం దగ్గరపడుతున్న ఈ సమయంలో, నా మనసు నుంచి ఒక మాట — నీ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను

ఎప్పటికీ ప్రేమతో… ఎల్లప్పుడూ నీతోనే.

ఈ పోస్టు కేవలం పుట్టినరోజు శుభాకాంక్ష మాత్రమే కాదు… 46 ఏళ్ల అనుబంధానికి ఒక గొప్ప ట్రిబ్యూట్. ప్రతి విజయం వెనుక ఒక మౌనమైన శక్తి ఉంటుందని, మెగాస్టార్ చిరంజీవి జీవితంలో ఆ బలం ఎప్పుడూ సురేఖ గారే అని ఇది గుర్తు చేస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా