AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Nukaraju: జబర్దస్త్ నూకరాజు పెళ్లి డేట్ ఫిక్స్.. వీడియో రిలీజ్ చేసిన కమెడియన్.. అమ్మాయి ఎవరంటే?

పటాస్, జబర్దస్త్‌లో కామెడీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నూకరాజు. అతని పంచులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇప్పుడీ జబర్దస్త్ కమెడియన్ పెళ్లిపీటలెక్కనున్నాడు. ఈ శుభవార్తను చెబుతూ స్వయంగా అతనే ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Jabardasth Nukaraju: జబర్దస్త్ నూకరాజు పెళ్లి డేట్ ఫిక్స్.. వీడియో రిలీజ్ చేసిన కమెడియన్.. అమ్మాయి ఎవరంటే?
Jabardasth Nukaraju
Basha Shek
|

Updated on: Feb 18, 2026 | 7:57 PM

Share

పటాస్ కామెడీషోలో ఒక చిన్న కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు నూకరాజు. ఆతర్వాత జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గోదావరి యాసలో ఈ కమెడియన్ వేసే పంచులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి టీవీ షోస్ తో పాటు అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తున్నాడు నూకరాజు. అలాగే సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి ఇంట్రెస్టింగ్ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ జబర్దస్త్ కమెడియన్ త్వరలోనే తన జీవితంలో ఒక కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ క్రమంలో తన పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందంటూ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను షేర్ చేశాడు నూకరాజు. దీంతో పలువురు బుల్లితె సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు నూకరాజుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇంతకీ నూకరాజు పెళ్లి చేసుకునే అమ్మాయి మరెవరో కాదు.. అతనితో కలిసి పలు స్కిట్లలో కలిసి నటించిన ఆసియా. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా వీరిద్దరూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓ వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా తమ పెళ్లి తేదీ ఫిక్స్ అయిందంటూ శుభవార్తను పంచుకున్నారు.కాగా వాలెంటైన్స్ డే సందర్భంగా నూకరాజ్ ఆసియాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఆసియాతో జబర్దస్త్ నూకరాజు..

కాగా నూకరాజు, ఆసియా చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే లైఫ్ లో కాస్త సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగానే ఇద్దరూ బాగా కష్టపడుతూ లైఫ్‌ లో బాగా సెటిలయ్యారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని నూకరాజ్ వీడియోలో చెప్పుకొచ్చాడు. అలాగే మేము ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? ఎప్పుడు మా ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలి? ఏ నెల మంచిది అనే విషయాల గురించి మీరు కూడా కామెంట్ల రూపంలో సలహాలు ఇవ్వండి అంటూ నెటిజన్లను కోరాడు నూకరాజు. ఈక్రమంలో చాలా మంది చాలా తేదీలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

నూకరాజు, ఆసియా షేర్ చేసిన వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us