AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aarthi Ganeshkar: 100కు పైగా సినిమాల్లో నటించిన ఈ చబ్బీ బ్యూటీ గుర్తుందా? ఇప్పడేంటిలా మారిపోయింది?

ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత నటిగానూ మెప్పించింది. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసింది. గోపీచంద్- అనుష్క శెట్టి జంటగా నటించిన శౌర్యం సినిమా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

Aarthi Ganeshkar: 100కు పైగా సినిమాల్లో నటించిన ఈ చబ్బీ బ్యూటీ గుర్తుందా? ఇప్పడేంటిలా మారిపోయింది?
Aarthi Ganeshkar
Basha Shek
|

Updated on: Feb 18, 2026 | 6:32 PM

Share

మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో శౌర్యం ఒకటి. శివ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో స్వీటీ అనుష్కా శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే పూనమ్ కౌర్, కమెడియన్ అలీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఇదే సినిమాలో అనుష్కకు ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి కూడా మంచి పేరు తెచ్చుకుంది. చబ్బీ చబ్బీగా కనిపిస్తూ తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. ముఖ్యంగా గోపీచంద్, ఈ చబ్బీ బ్యూటీ కాంబినేషన్ లో వచ్చే సీన్లు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఈ చబ్బీ పాప పేరు ఆర్తి గణేష్కర్. నీలగిరికి చెందిన ఈ నటి ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. దళపతి విజయ్, అజిత్, సూర్య, ధనుష్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. బేబీ షామిలీ ప్రధాన పాత్రలో మణిరత్నం తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ అంజలి లోనూ ఆర్తి నటించింది. ఇక చియాన్ విక్రమ్ హీరోగా నటించిన అరుళ్ అనే తమిళ సినిమాతో నటిగా మారింది ఆర్తి. ఆ తర్వాత గిరి, మాయావి, కాట్రుల్లవరై, చిన్న, కన్నమ్మ, పట్టియాల్ వంటి పలు సూపర్ హిట్ తమిళ సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటిగా యాక్ట్ చేసింది.

తెలుగు సినిమాల విషయానికి వస్తే.. గోపీచంద్ నటించిన శౌర్యం సినిమా ఆర్తికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత విశాల్ పిస్తా, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా, మూడు ముక్కల్లో చెప్పాలంటే.. ఇలా దాదాపు 4,5 సినిమాల్లో మెరిసింది. కేవలం తెలుగు, తమిళ్ లోనే కాకుండా మలయాళం, కన్నడ సినిమాల్లో నటించింది ఆర్తి. ఓవరాల్ గా వందకు పైగా సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ పలు తమిళ టీవీ షోలకు హోస్ట్ గానూ వ్యవహరించింది. తన యాంకరింగ్ తో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది.

ఇవి కూడా చదవండి

ఆర్తి గణేశ్కర్ లేటెస్ట్ ఫొటోస్..

సినిమాలు, టీవీ షోల సంగతి పక్కన పెడితే.. ఆర్తి ప్రముఖ తమిళ కమెడియన్ గణేష్కర్‌ను వివాహం చేసుకుంది. 2009 అక్టోబర్ లో కేరళలోని గురువాయూర్‌ టెంపుల్ లో వీరి పెళ్లి జరిగింది. కాగా గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించింది ఆర్తి గణేశ్కర్. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటోంది. అలాగే తన లేటెస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ ను కూడా పంచుకుంటోంది. ఇప్పుడు ఈ బ్యూటీ మరింత బొద్దుగా తయారైపోయింది. ఆమె మేకోవర్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అరే ఎలారా.. 18 ఏళ్లకే రూ.64 కోట్లు కాజేసిన కర్రాడు
అరే ఎలారా.. 18 ఏళ్లకే రూ.64 కోట్లు కాజేసిన కర్రాడు
బ్రహ్మ ముహూర్తంలో క్షుద్ర పూజలు, చెడు ప్రయోగాలు జరుగుతాయా?
బ్రహ్మ ముహూర్తంలో క్షుద్ర పూజలు, చెడు ప్రయోగాలు జరుగుతాయా?
నమ్మకద్రోహులకు రెండో అవకాశం ఇస్తున్నారా? చాణక్యుడు ఏమన్నాడంటే?
నమ్మకద్రోహులకు రెండో అవకాశం ఇస్తున్నారా? చాణక్యుడు ఏమన్నాడంటే?
US స్టూడెంట్ వీసా నిబంధనలు మారాయ్.. సెప్టెంబర్ 15 వరకే డెడ్‌లైన్‌
US స్టూడెంట్ వీసా నిబంధనలు మారాయ్.. సెప్టెంబర్ 15 వరకే డెడ్‌లైన్‌
ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందవచ్చా..?
ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందవచ్చా..?
శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? అసలు నిజం ఇదే
శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? అసలు నిజం ఇదే
వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ
వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ
శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకనే ఎందుకు ఉంటుంది?
శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకనే ఎందుకు ఉంటుంది?
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!